హీరోయిన్‌ మెహ్రిన్ మిస్సింగ్‌

ఇప్పటివరకు ఫిలిం ఇండ్రస్ట్రీలో ఎక్కడా చోటుచేసుకొని ఒక వింత పరిస్థితి మొదటిసారిగా ఎదురవుతోంది.. ఒక సినిమాలో నటించిన హీరోయిన్ పాత్ర సీన్లు పూర్తిగా ఎక్కడా తొలిగించిన సంగటనలు జరగలేదు. కానీ తమిళ్ ఇండ్రస్ట్రీలో ఆ సంఘటన ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది.

తెలుగు, తమిళంలో నవంబర్ 10న విడుదలైన ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త సెన్సేషన్ అవుతోంది. ఇప్పటి వరకు సినిమా విడుదల తర్వాత సినిమాలోని ఏ హీరోయిన్ సీన్స్‌ని పూర్తిగా డిలీట్ చేయలేదు. కానీ ఈ సినిమాలో నటించిన హీరోయిన్ సీన్స్ తమిళ వెర్షన్‌లో పూర్తిగా డిలీట్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.

సందీప్ కిషన్, మెహరీన్ హీరో హీరోయిన్‌లుగా తెలుగు మరియు తమిళ్‌లో ఏకకాలంలో నిర్మితమైన చిత్రం ‘C/o సూర్య’. సుశీంద్రన్ దర్శకుడు. ఇప్పుడు ఈ సినిమానే వార్తల్లోకి ఎక్కింది. ‘C/o సూర్య’ తమిళ్ వెర్షన్‌ చిత్రంలో నవంబర్ 13 నుండి 20 నిమిషాల నిడివిని తగ్గించారు. అందులో హీరోయిన్ మెహరీన్ సన్నివేశాల్ని పూర్తిగా తొలగించారు.

టైటిల్‌లో పేరు ఉంది కానీ సినిమాలో ఆమె ఎక్కడా లేదు. ఇక ఈ సీన్స్ తొలగించే ముందే హీరోయిన్ మెహరీన్‌కి చిత్ర దర్శకుడు క్షమాపణలు కూడా  చెప్పారని సమాచారం. మరి దీనిపై మెహరీన్ రియాక్షన్ ఏమిటీ అనేది మాత్రం ఇంకా తెలియలేదు.

Leave a comment