యువ హీరోకు ప్రభాస్‌ హెల్ప్‌

ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్‌ నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నిర్మాత ఎంఎస్‌ రాజు. ప్రభాస్‌, మహేష్‌బాబులతో పాటు పలువురు స్టార్‌ హీరోలతో సూపర్‌ హిట్‌ సినిమాలను నిర్మించాడు. ప్రభాస్‌తో వర్షం, మహేష్‌తో ఒక్కడు సినిమాలను నిర్మించింది ఈయనే. ఈ నిర్మాత తనయుడు సుమంత్‌ అశ్విన్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. పలు చిత్రాల్లో నటించినా కూడా ఈయనకు కమర్షియల్‌ హీరోగా బ్రేక్‌ రావడం లేదు. నిర్మాత ఎంఎస్‌ రాజు తనకున్న పరిచయాతో అశ్విన్‌ను హీరోగా నిలబెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

తాజాగా సుమంత్‌ అశ్విన్‌కు సాయం చేసేందుకు ప్రభాస్‌ ముందుకు వచ్చాడు. ప్రభాస్‌ సన్నిహితులు వంశీ మరియు ప్రమోద్‌లు ప్రారంభించిన యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌కు మంచి పేరు వచ్చింది. ప్రభాస్‌ కూడా భాగస్వామి అయిన యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో సుమంత్‌ అశ్విన్‌ హీరోగా ఒక సినిమా తెరకెక్కబోతుంది. యూవీ క్రియేషన్స్‌లో వచ్చిన దాదాపు అన్ని సినిమాలు కూడా మంచి సక్సెస్‌ను దక్కించుకున్నాయి.

అలాగే ఇప్పుడు సుమంత్‌ అశ్విన్‌కు కూడా యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌ ఒక సక్సెస్‌ ఇవ్వడం ఖాయం అంటూ సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వర్షంతో తనకు మొదటి సక్సెస్‌ ఇచ్చిన నిర్మాత ఎంఎస్‌ రాజు రుణంను ఇలా తీర్చుకుంటున్నాడు ప్రభాస్‌.

 

Leave a comment