Gossipsఫ్రీగా ఎందుకు చేయాలి.. పోసాని అదిరే పంచ్..!

ఫ్రీగా ఎందుకు చేయాలి.. పోసాని అదిరే పంచ్..!

తెలుగు ప్రేక్షకులకు పోసాని కృష్ణ మురళి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన రచయితగా పరిచయం అయ్యి ప్రస్తుతం స్టార్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా టాలీవుడ్‌లో వెలుగు వెలుగుతున్నాడు. సినిమాల్లో స్టార్‌గా దూసుకు పోతున్నా కూడా బుల్లితెరపై కూడా ఈయన కనిపిస్తూ వస్తున్నాడు. బుల్లితెరపై పలు షోలు చేస్తున్న పోసాని కృష్ణ మురళి భారీ పారితోషికం తీసుకుంటున్నట్లుగా తానే స్వయంగా ఒప్పుకున్నాడు.

కొన్ని గేమ్‌ షోల్లో సరదాగా పాల్గొనేందుకు వెళ్లినా కూడా పోసాని పారితోషికం డిమాండ్‌ చేస్తాడనే టాక్‌ ఉంది. అది నిజమే అని తాజాగా ఒక ఇంటర్య్వూలో పేర్కొన్నాడు. యాంకర్‌ సుమ ఒక షోకు యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె డబ్బులు తీసుకుని యాంకర్‌గా చేస్తున్నారు. అలాంటప్పుడునే నేను ఎందుకు ఫ్రీగా ఆ షోను చేయాలి. అందుకే ఆమె అడిగినా కూడా డబ్బులు డిమాండ్‌ చేశాను.

రోజుకు లక్ష రూపాయలు ఇస్తే షోలో చేసేందుకు తనకు ఏం అభ్యంతరం లేదని నిరభ్యంతరంగా పోసాని వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటి నుండి కూర్చుని తిన్నా కూడా తనకు తరగని ఆస్తి ఉందని, దేవుడి దయవల్ల బాగానే సంపాదించాను అంటూ పోసాని పేర్కొన్నాడు. అయినా కూడా ఏ షోను కూడా ఫ్రీగా చేయను అంటూ పోసాని క్లారిటీగా చెప్పుకొచ్చాడు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news