వర్మపై ఆ ఎమ్మెల్యే ఫైర్..

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి వ‌ర్మ‌పై టీడీపీ నేత‌ల మాట‌ల దాడి ఆగ‌డం లేదు. తాజా గా ఓ టీడీపీ ఎమ్మెల్యే వ‌ర్మ ఓ సైకో అని విమ‌ర్శించాడు.`లక్ష్మీస్ ఎన్టీఆర్` చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలపై అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తీవ్ర విమ ర్శ లు గుప్పించారు. కులాల మధ్య వర్మ చిచ్చుపెడుతున్నారని ఆయన ఆరోపించారు.

రామ్ గోపాల్ వర్మ ఓ సైకో అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు!ఈజీ మనీ కోసం కులాల మధ్య చిచ్చు పెడుతూ సినిమాలు తీస్తున్నారని ఆయన వర్మపై దుమ్మెత్తిపోశారు. టీడీపీకి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ నిర్మా తలతో కలిసి సినిమా నిర్మిస్తే ఊరుకోబోమని తీవ్ర స్వరంతో హెచ్చరించారు.ఇక సినీ రంగం నుంచి కూడా వ‌ర్మ‌కు కొన్ని కౌంట‌ర్లు ప‌డుతున్నాయి.

ఐతే వీటిపై ఎప్ప‌టిక‌ప్పుడు స్పందిస్తున్నా ఆగ‌డం లేదు. ఇక ఎన్టీఆర్‌, ల‌క్ష్మీ పార్వ‌తి పాత్ర‌ల‌లో కొత్త నటీన‌టులు తెర‌పై క‌నిపించ‌నున్నారు.తాను ఈ సినిమా తీసేందుకు ఎవ్వ‌రినీ క‌ల‌వ‌బోన‌ని, ఎన్టీఆర్ ఆత్మే త‌న కల‌లోకివ‌చ్చి ఈ స్క్రిప్ట్ రాసేందుకు త‌గిన శ‌క్తి త‌న‌కు ఇస్తోంద‌ని సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు.

Leave a comment