ఫ‌స్ట్ లుక్ అదుర్స్ : సీక్వెల్ రోబో వ‌చ్చేసింది

అప్ప‌ట్లో ఐశ్వ‌ర్య రాయ్ రొబో సినిమాకే హైలెట్ గా నిలిచింది. ర‌జ‌నీతో ప్రేమ పాఠాలు వ‌ల్లించింది. ఈ పిల్లి క‌ళ్ల సోయగం ఒల‌క‌బోసిన .. హొయ‌లు సినిమా రేంజ్‌ని పెంచాయి. అలానే అభిన‌యం ప‌రంగా కూడా మంచి మార్కులే కొట్టేసింది.ఈ సారి ర‌జ‌నీతో న‌ట‌న‌ప‌రంగా అమీతుమీ తెల్చుకునేందుకు అమిజాక్స‌న్ రంగంలోకి దిగింది. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ నెట్ చ‌ల్ చేస్తోంది.

అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో శంకర్ క్రియేట్ చేసిన ఈ అందమైన రోబో గా అమీ ఫ్యాన్స్ ని తెగ అల‌రిస్తోంది.రజినీకాంత్ హీరోగా చేస్తున్న 2.0 మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ మూవీని సుమారు 400 కోట్ల హై బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్ నిర్మాణ సార‌థ్యం వ‌హించింది. ఏఆర్ రెహమాన్ స్వరాలు అందిస్తున్నారు.

ఈ మూవీని తమిళ, తెలుగు, హిందీ, మలయాళ భాషలతో పాటు జపాన్, కొరియా, చైనాల్లో భారీ ఎత్తున విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.ఇప్ప‌టికే విడుద‌లైన 3 డీ మేకింగ్ వీడియో నెటిజ‌నుల‌ను తెగ ఆక‌ట్టుకుంది.ఇక ఫ‌స్ట్ లుక్ కూడా సినిమా అంచ‌నాల‌ను య‌మ స్పీడుగా పెంచేసింది. ర‌జ‌నీ సైతం శంక‌ర్ టేకింగ్ మేకింగ్ పై తెగ మురిసిపోతున్నారు. ప్రశంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. ఈ సిన్మా త‌రువాత భార‌తీయుడు సీక్వెల్‌ని దిల్ రాజు బ్యాన‌ర్‌లో రూపొందించ‌నున్నారు శంక‌ర్‌.

Leave a comment