ప్రేమ జంట ఒకటైంది..!

ఏమాయ చేసావే సినిమాతో కలిసి పనిచేసిన నాగ చైతన్య, సమంత అప్పటి నుండి వారి సీక్రెట్ రిలేషన్ ను మెయింటైన్ చేస్తూ వచ్చారు. అభిరుచులు కలవడంతో ఒకరినొకరు ఇష్టపడ్డారు. కొద్దిరోజులు సీక్రెట్ గా వీరి రిలేషన్ గురించి ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడినా ఫైనల్ గా ఇద్దరు వారి ప్రేమను దక్కించుకుని పెళ్లిపీటలెక్కారు.

శుక్రవారం రాత్రి హిందు సంప్రదాయం ప్రకారం ప్రేమ జంట ఒకటైంది. ఇక ఈరోజు క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం ఇద్దరు చర్చ్ లో మళ్లీ పెళ్లిచేసుకోనున్నారు. చైతు సమంతల పెళ్లికి సినిమా వాళ్లు చాలా తక్కువమంది వచ్చారట. గోవాలో పెళ్లి తర్వాత హైదరాబాద్ లో ఏర్పరచే రిసెప్షన్ కు సిని, రాజకీయవేత్తలంతా అటెండ్ అవుతారని తెలుస్తుంది. ఇప్పటికే నిన్న రాత్రి జరిగిన పెళ్లి వేడుక సంబరాలు ఫోటోల రూపంలో సోషల్ మీదియాలో హల్ చల్ చేస్తున్నాయి.

 

Leave a comment