Gossipsఓ రాజా నువ్వు గ్రేట్

ఓ రాజా నువ్వు గ్రేట్

రాజా ద గ్రేట్ ట్రైల‌ర్ విడుదల ఫంక్ష‌న్ అట్టహాసంగా జ‌రిగింది.దీపావ‌ళి కానుక‌గా విడుద‌ల అవుతున్న ఈ సినిమాపై ఇప్ప‌టికే అనేకానేక అంచ‌నాలు ఉన్నాయి. ర‌వితేజ దిల్ రాజుతో క‌లిసి 13 ఏళ్ల తరువాత ప‌నిచేశారు.

ఈ సందర్భంగా ర‌వితేజ మాట్లాడుతూ “మాతో పాటు శిరీష్‌ ఈ సినిమాకి దగ్గరుండి వర్క్‌ చేశారు. అంతకుముందు ఆయనతో నాకంత ఇంట్రాక్షన్‌ లేదు. రాధిక, రాజేంద్రప్రసాద్, పోసానిగార్లతో వర్కింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ సూపర్‌. వాళ్లతో పాటు శ్రీనివాసరెడ్డి బాగా నటించారు.

మెహరీన్‌కి కూడా ఈ సినిమా హ్యాట్రిక్‌ అవుతుంది. ఎడిటర్‌ తమ్మిరాజు, డీఓపీ మోహన్‌కృష్ణ, సంగీత దర్శకుడు సాయికార్తీక్‌లతో ఫస్ట్‌ టైమ్‌ వర్క్‌ చేశా. వాళ్లందరూ ఈ సిన్మాతో నెక్ట్స్‌ లెవల్‌కి వెళతారని అనుకుంటున్నా” అని అన్నారు. నిర్మాత దిల్ రాజు న‌మ్మ‌క‌మే త‌న బ‌ల‌మ‌ని డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెలిపారు.ఈ దీపావళి దిల్ రాజు బ్యాన‌ర్ మ‌రో హిట్ కొట్ట‌డం ఖాయ‌మ‌ని న‌ట‌కిరీటీ రాజేంద్ర ప్ర‌సాద్ అన్నారు. ఈ వేడుక‌కి క‌థానాయిక మెహ్రీన్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news