మెర్సల్ రికార్డ్.. విజయ్ సత్తా చాటాడు..!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న మెర్సల్ సినిమా టీజర్ నిన్న రిలీజ్ అయ్యింది. ఈ టీజర్ సినిమా మీద అంచనాలను పెంచేయడమే కాకుండా టీజర్ లలో సౌత్ సినిమాల్లో ఏ సినిమా నెలకొల్పని రికార్డ్ నమోదు చేసుకుంది. మెర్సల్ సినిమా టీజర్ కేవలం 24 గంటల్లోనే అత్యధిక వ్యూయర్ కౌంట్ సాధించడమే కాకుండా 699 వేల లైకులతో సంచలన రికార్డ్ సొంతం చేసుకుంది.

ఇప్పటికే కోలీవుడ్ లో విజయ్ అజిత్ ఫ్యాన్స్ ల మధ్య యుద్ధం తెలిసిందే. అజిత్ వివేగం టీజర్ 553 వేల లైకులతో రికార్డ్ సాధించగా విజయ్ ఫ్యాన్స్ మెర్సల్ మొదటి టీజర్ తోనే ఆ రికార్డును బ్రేక్ చేశారు. ఇక టీజర్ తో విజయ్ మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు. అత్లీ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో సమంత, కాజల్ అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఇక నిత్యా మీనన్ ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ ప్లే చేస్తుంది. మెర్సల్ రికార్డుతో విజయ్ ఈ సినిమా తప్పకుండా సంచలన విజయం దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

 

Leave a comment