జై లవ కుశ 2 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ?

jai lava kusa 2 days collections

తొలిసారి తారక్ త్రిపాత్రాభినయం పోషించడం, అందులో ఒకటి నెగెటివ్ రోల్ కావడం, రిలీజ్‌కి ముందు వచ్చిన  టీజర్-ట్రైలర్స్‌తో ఆసక్తి రేకెత్తించడంతో తార‌క్ లేటెస్ట్ మూవీ జై ల‌వ‌కుశ‌పై రిలీజ్‌కు ముందే భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇక జై రావ‌న్ క్యారెక్ట‌ర్‌లో ఎన్టీఆర్ విరోచిత న‌ట విశ్వ‌రూపాన్ని చూపించ‌డంతో జై ల‌వ‌కుశ సినిమా చూసేందుకు జ‌నాలు తొలి రోజు నుంచే థియేట‌ర్ల‌లో పోటెత్తారు. దీంతో జై ల‌వ‌కుశ వ‌సూళ్లు భీభ‌త్సంగా ఉన్నాయి. ఈ చిత్రం యూఎస్ లో సైతం ఒక రేంజ్ లో రికార్డు కలెక్షన్ల దిశగా దూసుకెళ్తోంది. ఎన్టీఆర్  ‘నాన్నకు ప్రేమతో’ 2 మిలియన్ క్లబ్ లో నిలువగా, ఆ తర్వాత ‘జనతా గ్యారేజ్’ 1.8 మిలియన్స్ తో నిలిచింది. ‘బాద్ షా’ 1.2 మిలియన్స్, ‘టెంపర్’ 1 మిలియన్ తో మొదటి నాలుగు స్థానాలలో నిలిచాయి. జై ల‌వ‌కుశ దూకుడు చూస్తుంటే ఓవ‌ర్సీస్‌లో ఎన్టీఆర్ పాత సినిమాల రికార్డుల‌ను తిర‌గ‌రాయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

ఇక జై ల‌వ‌కుశ ఇప్ప‌టి వ‌ర‌కు టోటల్‌గా $ 734,284 (రూ. 4.76 కోట్లు) కొల్ల‌గొట్టింది. ఇక రెండు రోజుల‌కు ఈ సినిమా వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ. 83 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది . సినిమాకు మంచి టాక్ రావ‌డంతో పాటు వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఏకంగా 2400 స్క్రీన్ల‌లో రిలీజ్ చేయ‌డం కూడా ఈ సినిమాకు బాగా క‌లిసి వచ్చింది. ఈ దూకుడు చూస్తుంటే ఈ  శ‌నివారానికే సినిమా రూ.100 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు కొల్ల‌గొట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇక ఈ సినిమా తొలి రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.32 కోట్ల షేర్ రాబ‌ట్టింది.

Leave a comment