Moviesకేరళ లో ఒక ఊపు ఊపుతున్న పవన్ కళ్యాణ్!!

కేరళ లో ఒక ఊపు ఊపుతున్న పవన్ కళ్యాణ్!!

భారీ అంచనాల నడుమ నిన్న విడుదల అయిన కాటమరాయుడు చిత్రం ప్రేక్షకులలో మిక్స్ టాక్ వచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బాగానే కలక్షన్ లు లాగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో కూడా చాలా హడావిడి చేస్తున్న ఈ చిత్రం పోరుగు రాష్ట్రం కేరళ లో కూడా పాజిటివ్ రెస్పాన్స్ ని సంపాదించుకుంది. రెండొందల యాభై స్క్రీన్స్ పైగా అబ్రాడ్ లో తన హవా చాటుతున్న పవన్ కళ్యాణ్ కేరళ లో సైతం థియేటర్ లలో టికెట్లు లేకుండా చేస్తున్నాడు. కసర్గాడ లాంటి ప్రాంతాల్లో ఈ సినిమా రికార్డు విజయం నమోదు చేసింది. ప్రధాన పట్టణాలు అయిన కొచ్చి , త్రివేండ్రం లలో మాట్లీ ప్లేక్స్ లలో కూడా షో లు పెంచుతున్నారు. మాస్ సినిమా అని ఫిక్స్ అవ్వగా మల్టీ ప్లెక్స్ లలో కూడా సినిమా షోస్ పెంచాలని డిమాండ్ రావడం విశేషం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news