‘బీకామ్’లో ఫిజిక్స్.. విజయవాడ ఎమ్మెల్యే జలీల్ నాలెడ్జ్‌కి జనాలు నీరాజనాలు

MLA Jaleel khan shown his education skills

Vijayawada MLA Jaleel Khan’s latest video going viral on social media in which he shows his education skills. He said that he loves Physics and Maths that’s why He choosen BCom.

తెలుగు నేతల్లో చాలామందికి సరిగ్గా ఎడ్యుకేషన్ లేదన్న విషయం అందరికీ తెలుసు. జనరల్ నాలెడ్జ్ అంతకన్నా లేదు. ఏదో పదవి పేరుతో అందరూ నెట్టుకొస్తున్నారే తప్ప.. మైకు ముందుకొస్తే అందరూ తుస్సే. తిట్టుకోవడంలో అంతా దిట్టే కానీ.. నాలెడ్జ్ విషయానికొస్తే మైండ్ మొత్తం నిల్. నేతల మాటల్ని బట్టే దీన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే.. ఓ నేత మాత్రం కాస్త ఎగ్జైట్‌మెంట్‌లో నోరు జారాడు. తానే తోపు అన్నట్లుగా వ్యవహరించి.. యాంకర్‌కి చుక్కలు చూపించాడు. విశేషం ఏమిటంటే.. సమాధానం తప్పని యాంకర్ వారిస్తున్నా, లేదు కరెక్టేనని ఆ నేత వారించడం మరింత హాస్యాస్పదం.

విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే అయిన జలీల్ ఖాన్‌ని తాజాగా ఓ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేశారు. ప్రారంభంలో పరిచయాలు చేసుకునే నేపథ్యంలో.. మీరేం చదువుకున్నారని ఆ విలేకరి ప్రశ్నించాడు. అందుకు బదులుగా ఆ నేత ‘బీకామ్’ అని చెప్పుకొచ్చారు. ఆ కోర్సే ఎందుకు ఎంపిక చేసుకున్నారు? సీఎ అవ్వాలని అప్పట్లో లక్ష్యం ఏమైనా పెట్టుకున్నారా? అని అడిగాడు. ఇందుకు జవాబుగా ఆ నేత ఏం చెప్పాడో తెలుసా..? తనకి మ్యాథ్స్, ఫిజిక్స్ అంటే చాలా ఇష్టమని.. అందుకే ఆ కోర్సు ఎంపిక చేసుకున్నానని చెప్పాడు. దాంతో.. ఆయన ముందు కూర్చున్న విలేకరికి దెబ్బకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆ తర్వాత తేరుకుని.. బీకామ్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ ఉండవు కదా అని అన్నాడు. లేదు ఆ రెండు సబ్జెక్టులు ఉన్నాయని బల్లగుద్దిమరీ చెప్పాడు. అప్పుడు ఆ యాంకర్ ఎక్స్‌ప్రెషన్లు చూస్తే.. ఎవ్వరైనా పగలబడి నవ్వేస్తారు. అసలు నేను ఎవరి ముందు కూర్చున్నానురా బాబు అన్నంతగా ఫేస్ పెట్టేశాడు.

ఇంతేకాదు.. ఇంకా చాలా తతంగం నడించింది. అసలు ఆ కోర్సులో సబ్జెక్టులు ఏముంటాయో కూడా ఆ నేతకు తెలీదు. అవేంటో నువ్వే చెప్పు అని తెలివిగా యాంకర్‌నే ప్రశ్నించిన ఆయన తెలివికి జోహార్లు చెప్పుకోవాల్సిందే. పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు.. టపీటపీమని కోర్సులు చెప్పాడు. బీకామ్‌లో కామర్స్ ఉంటుంది మ్యాథ్స్, ఫిజిక్స్ ఉండదు కదా అన్నాడు. అప్పుడు కూడా ఆ నేత ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తనదైన రీతిలో సంజాయిషీ ఇచ్చుకున్నాడు. కామర్స్ అంటేనే మ్యాథ్స్ కదా అన్నాడు. ఇంకేముంది.. ఆ యాంకర్‌కి మళ్ళీ షాక్ తగిలింది. అసలైన ట్విస్ట్ ఏంటంటే.. తనకు చైల్డ్‌హుడ్ నుంచే లెక్కల్లో వందకి వంద మార్కులు వస్తాయని ఆ నేత చెప్పాడు. అప్పుడు చూడాలి మనోడు మొహం.. ‘ఇదేం ఖర్మరా బాబు ’ అన్నట్లు! ఈ మొత్తం కామెడీ ఎపిసోడ్‌ని.. కింది వీడియో చూసి మనసారా నవ్వుకోండి.. మన సిగ్గుమాలిన పరిస్థితిని చూసి..

Leave a comment