Newsబాబుగారు మళ్లీ మొదలెట్టారు..!

బాబుగారు మళ్లీ మొదలెట్టారు..!

ఓటుకు నోటు కేసులో తనదైన ఫార్ములా ఫాలో అవుతున్నారు చంద్రబాబు. అది కూడా ఆయనకు బాగా అచ్చొచ్చిన ఫార్ములా. ఇటీవల ఆయనపై దర్యాప్తు చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించడం.. ఆ తర్వాత సెప్టెంబర్ లోపు నివేదిక ఇస్తామని ఏసీబీ అధికారులు చెప్పడం చకచకా జరిగిపోయాయి. దీంతో బాబుగారికి కష్టాలు మొదలైనట్టే అనుకున్నారంతా.

ఓటుకునోటు కేసులో తనపై విచారణ జరపకుండా ఆదేశించాలంటూ ఆయన ఉమ్మడి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈకేసు అవినీతి నిరోధక చట్టం కిందకు రాదనేది ఆయన వాదన. ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసిన వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి కేసుకు సంబంధం లేదని..రాజకీయ కక్ష్య కోసమే పిటిషన్ వేశారనేది బాబు తరఫు లాయర్ల వాదన.

అయితే చంద్రబాబుకు ఇలా హైకోర్టు తలుపు తట్టడం కొత్తేమీ కాదు. గతంలోనూ ఆయన ఇలా చాలాసార్లు హైకోర్టుకెళ్లి తనపై విచారణ జరక్కుండా అడ్డుకున్నారు. దాదాపు పదికి పైగా కేసుల్లో ఆయన స్టే తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో ముఖ్యమైనది ఏలేరు స్కాం. ఇది అప్పట్లో ఎంత కలకలం రేపిందో తెలిసిందే. దీనిపై విచారణ ఆపాలంటూ జిల్లా కోర్టు నుంచి మొదలుపెట్టి సుప్రీం దాకా వెళ్లి స్టే లు తెచ్చుకున్నారు.

ఇక IMG కేసు విషయంలో కూడా అంతే. ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉండి.. కేబినెట్ ఆమోదం కూడా లేకుండా దాదాపు 800ఎకరాలు కేటాయించారన్నది బాబుపై ఆరోపణ. ఈ కేసులో కూడా ఆయన విచారణ జరక్కుండా స్టే తెచ్చుకోగలిగారు. అంతకుముందు బహుశా 2005లో అనుకుంట. లక్ష్మీపార్వతి బాబు అవినీతిపై అక్రమాస్తులకేసు వేశారు. దీనికి సంబంధించి రెండు కేసులు స్టే ఆర్టర్స్ తో ఇంకా పెండింగ్ లోనేఉన్నాయి.

అలాగే పాల్వాయి గోవర్థన్ రెడ్డి వేసినకేసుతో పాటు.. హెరిటేజ్ ఫుడ్స్ కు సంబంధించి సేల్స్ టాక్స్ రాయితీల విషయంలో కూడా కేసు ఉంది. దీనిపై కూడా స్టే ఆర్టర్ కంటిన్యూ అవుతోంది. ఇంకో విషయం ఏంటంటే.. తన పై పలు కేసులు పెండింగ్ లో ఉన్నాయని బాబుగానే స్వయంగా ఎన్నికల అఫడవిట్ లో పేర్కొన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news