Gossipsకాజల్ దెబ్బకు మెగా ప్యామిలీ షేక్ అయ్యి షాకయిందా?

కాజల్ దెబ్బకు మెగా ప్యామిలీ షేక్ అయ్యి షాకయిందా?

తొమ్మిదేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న మెగాస్టార్ అన్ని విషయాల్లోనూ పర్పెక్ట్‌గా ప్లాన్ చేస్తున్నాడు. రెండు సంవత్సరాలుగా కథలు విని ఫైనల్‌గా తమిళ్ బ్లాక్ బస్టర్ హిట్ కత్తి సినిమా రీమేక్‌కి ఓటేశాడు. అలాగే చాలా మంది డైరెక్టర్స్‌ని టెస్ట్ చేశాక తనకు భక్తుడు అండ్ ‘ఠాగూర్’ సినిమాలో చిరంజీవిని అద్భుతంగా చూపించిన వినాయక్‌ని ఫైనల్ చేశాడు. తన ఫిజిక్, లుక్ విషయంలో కూడా ఒకటికి పదిసార్లు క్రాస్ చెక్ చేసుకున్నాడు చిరు. ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు, యూనిట్ మెంబర్స్ కూడా చిరంజీవి లుక్ బాగుందని చెప్పడంతో అప్పుడు షూట్‌కి వెళ్ళాడు. మధ్యలో మాటీవీ ప్రోగ్రాంలో చిరు షో…డ్యాన్స్ కూడా బాగుండడంతో సినిమాకి క్రేజ్ వచ్చింది. సినిమా ఫస్ట్ షెడ్యూల్ అయ్యాక రష్ చూసుకున్న చిరంజీవి…కొణిదేల బేనర్‌ పైన ఈ సినిమాను నిర్మిస్తున్న చరణ్ కూడా ఫుల్ హ్యాపీగా ఫీలయ్యారు.

అంతా బాగానే ఉంది గానీ ఒక్క విషయంలో మాత్రం మెగాస్టార్ పూర్తిగా నిరాశగా ఉన్నాడు. తన పక్కన నటించే హీరోయిన్ సెలక్షన్ విషయంలో మాత్రం ఎంతకూ ఫైనల్ డెసిషన్ రాలేకపోతున్నాడు. బాలీవుడ్ భామలను అప్రోచ్ అయితే వాళ్ళు చెప్పిన రెమ్యూనరేషన్స్‌కి దిమ్మతిరిగింది. ఆ తర్వాత జాక్వలిన్ ఫెర్నాండెజ్‌ని ట్రై చేస్తే అమ్మడు కూడా మూడున్నర కోట్లు ఇమ్మని అడిగింది. దాంతో ఇలా కాదని చెప్పి కాజల్‌ని ఫిక్స్ చేసుకున్నారు. చందమామ సినిమాలో నాగబాబు కూతురిగా, మగధీరలో రామ్ చరణ్‌కి జోడీగా, సర్దార్ గబ్బర్ సింగ్‌లో పవన్ కళ్యాణ్‌తో, ఆర్య-2లో అల్లు అర్జున్‌తో నటించిన కాజల్ అయితే మెగా ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీలవుతారని భావించారు. ఎలానూ సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం లాంటి డిజాస్టర్స్‌‌ని ఖాతాలో వేసుకుని ఉంది కాబట్టి తక్కువ పేమెంట్‌కే ఒప్పించొచ్చని భావించారు. తీరా అమ్మడిని అప్రోచ్ అయ్యాక మాత్రం కాజల్ చెప్పిన రేటుకి, లాజిక్‌కి మెగాస్టార్‌కి, రామ్ చరణ్‌కి దిమ్మతిరిగిందట. రెమ్యూనరేషన్ రెండున్నర కోట్లు అడిగిందట. చేతిలో సినిమాల్లేక ఖాళీగానే ఉన్నావ్ కదా…అంత రేటెందుకని అడిగితే…….‘నేను ఇంకా యంగ్‌గానే ఉన్నాను. కుర్ర హీరోల పక్కన యాక్ట్ చేస్తే ఇంకా బోలెడు సినిమాల్లో ఛాన్సులు వస్తాయి. అదే చిరంజీవి పక్కన చేస్తే ఆ తర్వాత బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలాంటి వాళ్ళతో యాక్ట్చ చేయాల్సిందే కదా….అందుకే ఆ ప్రైస్..’ అని చెప్పిందట. స్వయానా రామ్ చరణ్ కాల్ చేసినా కూడా ఇదే ఆన్సర్ చెప్పిందట కాజల్. మెగా ఫ్యామిలీలో మెంబర్‌లా కలిసిపోయిన కాజలేనా ఇలా మాట్లాడుతోంది అని వినాయక్ కూడా షాకయ్యాడట. డబ్బుల విషయంలో కాజల్‌ ఎంత నిక్కచ్చిగా ఉంటుందో ఆల్రెడీ టాలీవుడ్‌కి తెలుసు. కానీ ఈ రేంజ్ షాక్‌ని మాత్రం ఊహించి ఉండరు. కాజలా….మజాకానా?

Latest news