Gossipsశ్రీమంతుడు మ్యాజిక్ మళ్ళీ షురూ!!

శ్రీమంతుడు మ్యాజిక్ మళ్ళీ షురూ!!

శ్రీమంతుడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి షాకిచ్చిన మహేష్ బాబు, కొరటాల శివ మరోసారి కలిసి వర్క్ చేయబోతున్నారు. బాహుబలి తర్వాత సెకండ్ పొజిషన్‌లో శ్రీమంతుడు సినిమా నిలుస్తుందని ఎవ్వరూ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ మహేస్ బాబు, కొరటాల శివ ఆ మేజిక్ చేసి చూపించారు. ఇఫ్పుడీ మేజికల్ కాంబో మరోసారి రిపీట్ అవబోతుంది. నిజానికి ఈ ప్రాజెక్ట్‌లో హీరోగా రామ్ చరణ్ యాక్ట్ చేయాల్సింది. కానీ చరణ్ ఆల్రెడీ ధృవ సినిమాలో యాక్ట్ చేస్తూ ఉండడం….ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో చేయడానికి కమిట్ అయి ఉండడంతో డేట్స్ ఖాళీ లేవు. అందుకే కొరటాల శివ మహేష్ బాబును అప్రోచ్ అయ్యాడు. ప్రజెంట్ మురుగదాస్ దర్శకత్వంలో తమిళ్, తెలుగు బై లింగ్వల్ ప్రాజెక్ట్ చేస్తున్న మహేష్ బాబు….ఆ సినిమా షూటింగ్ అయిన వెంటనే కొరటాల శివతో ప్రాజెక్టుని పట్టాలెక్కించనున్నాడు.

మహేష్ బాబు, మురుగదాస్‌ల ప్రిస్టేజియస్, భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ డిసెంబర్‌ నాటికి కంప్లీట్ అయ్యే ఛాన్సుంది. ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వగానే కొరటాల శివ సినిమా షూటింగ్ టేకాఫ్ అవుతుంది. ప్రస్తుతం జనతా గ్యారేజ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌తో ఫుల్లు బిజీగా ఉన్నాడు కొరటాల. ఆ సినిమా రిలీజ్ అయ్యాక ఓ రెండు వారాల పాటు ప్రమోషన్ యాక్టివిటీస్‌లో పాల్గొంటాడు. ఆ తర్వాత నుంచీ మహేష్‌బాబు స్క్రిప్ట్ పైనే కూర్చోనున్నాడు. శ్రీమంతుడు తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి ఎక్స్‌పెక్టేషన్స్ హై ఎండ్‌లో ఉండే అవకాశం ఉంది. అందుకే ఈ సారి అంతకుమించిన సబ్జెక్ట్‌నే రెడీ చేయాలని కొరటాల ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం కొరటాల శివ, మహేష్ బాబులు తీసుకున్న రెమ్యూనరేషన్ కేూడా టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయనున్న దానయ్య మహేష్ బాబుకి 25 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడట. అలాగే కొరటాల శివ 14 కోట్ల రెమ్యూనరేషన్‌ని ఛార్జ్ చేస్తున్నాడట. మురుగదాస్ సినిమాతో తమిళ్‌లో కూడా మహేష్‌కి మార్కెట్ క్రియేట్ అవుతుంది కాబట్టి బడ్జెట్ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదని నర్మతానే దానయ్యను కన్విన్స్ చేసిందట.

ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్ అందరూ కూడా ఒక విషయంలో కొరటాల శివను చూసి ఆశ్ఛర్యపోతున్నారు. కరెక్ట్‌గా చెప్పాలంటే జెలసీగా ఫీల్ అవుతున్నారు. బోయపాటి శ్రీను, పైడిపల్లి వంశీ, వినాయక్‌లతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా కొన్ని సార్లు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి తెలుగు ఇండస్ట్రీలో ఉంది. కానీ కొరటాల శివ మాత్రం సినిమా కంప్లీట్ అవ్వకముందే మరో స్టార్ హీరోని పట్టేస్తున్నాడు. మహేష్‌తో సినిమా పూర్తవగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్‌తో సినిమా చేయడానికి అన్నీ సెట్ చేసుకున్నాడు కొరటాల. ఏది ఏమైనా ప్రస్తుతం ఇండస్ట్రీలో కొరటాల హవా మామూలుగా నడవడం లేదు. ఇంకో రెండు హిట్స్ పడితే మన హీరోలక్కూడా దొరక్కుండా పోతాడేమో మరి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news