షారుఖ్ ” జీరో ” ట్రైలర్ రివ్యూ..

20

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కొన్నాళ్లుగా హిట్ లేక సతమతమవుతున్నాడు. ప్రయోగాలైతే చేస్తున్నాడు కాని వాటికి తగినట్టుగా ఫలితాన్ని అందుకోలేకపోతున్నాడు. అందుకే సొంత ప్రొడక్షన్ లో ఓ క్రేజీ సినిమా చేస్తున్నాడు. ఆనంద్ ఎల్ రాయ్ డైరక్షన్ లో షారుఖ్ చేస్తున్న సినిమా జీరో. షారుఖ్ నిర్మాణంలో అతని భార్య గౌరి ఖాన్ ఈ సినిమా నిర్మించారు.

షారుఖ్ సరసన అనుష్క శర్మ, కత్రినా కైఫ్ లు నటించారు. సినిమాలో షారుఖ్ షార్ట్ మ్యాన్ అంటే పొట్టివాడిగా నటిస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ఈరోజు షారుఖ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ట్రైలర్ అదరగొట్టగా సినిమా కచ్చితంగా షారుఖ్ రేంజ్ హిట్ కొడుతుందని అంటున్నారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా గెస్ట్ రోల్ చేశాడని టాక్. ఏది ఎలా ఉన్నా జీరో ట్రైలర్ తో సంచలనం సృష్టిస్తున్న షారుఖ్ ఈసారి రికార్డులు సృష్టిస్తాడేమో చూడాలి.

\https://youtu.be/Ru4lEmhHTF4

Leave a comment