Moviesపరుగెత్తే ప్రతి వాడు పారిపోతున్నట్టు కాదు... 'యుద్ధం శరణం' ట్రైలర్..!(వీడియో)

పరుగెత్తే ప్రతి వాడు పారిపోతున్నట్టు కాదు… ‘యుద్ధం శరణం’ ట్రైలర్..!(వీడియో)

అక్కినేని నాగ చైతన్య హీరోగా నూతన దర్శకుడు కృష్ణ డైరెక్ట్ చేస్తున్న సినిమా యుద్ధం శరణం. వారాహి చలనచిత్ర బ్యానర్లో సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమా ఆడియో ఈరోజు రిలీజ్ అయ్యింది. రాజమౌళి చీఫ్ గెస్ట్ గా వచ్చిన ఈ సినిమా ఆడియోలో సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అందమైన కుటుంబం ఆ సరదా సంఘటనలు ఇలాంటి కుటుంబాన్ని ఓ వ్యక్తి డిస్ట్రబ్ చేస్తాడు మరి అతని మీద హీరో ఎలా యుద్ధం చేశాడు అన్నది సినిమా కథ. ట్రైలర్ లోనే సినిమా కథ చెప్పేసిన దర్శకుడు టేకింగ్ పరంగా చైతుని కొత్తగా చూపించాడని తెలుస్తుంది.

దేవి ఆర్ నాథన్ కథ అందించగా కృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. అబ్బూరి రవి మాటలందిస్తుండగా వివేక్ సాగర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆనందంగా ఉన్నప్పుడు ప్రపంచం అద్భుతంగా ఉంటుంది.. పరుగెత్తే ప్రతి వాడు పారిపోతున్నట్టు కాదు.. ఇంటెన్సిటీగా చైతు చెబుతున్న డైలాగ్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయని చెప్పొచ్చు. శ్రీకాంత్ విలనిజం కూడా హైలెట్ గా ఉంటుందనిపిస్తుంది. సెప్టెంబర్ 8న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

https://youtu.be/ctLEJPTIYi4

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news