షాకింగ్ బ్రేకింగ్ న్యూస్ : పవన్ కళ్యాణ్ నిర్మాతగా ఎన్టీఆర్ హీరోగా కొత్త సినిమా

ntr-pawan-kalyan

తెలుగు సినిమా రంగంలో ఒకప్పుడు నందమూరి కుటుంబం హీరోలకి , మెగా ఫ్యామిలీ హీరోలకి సినిమాల పరంగా ఉండే పోటీ మాములుగా ఉండేది కాదు. ఒకే రోజు కానీ వారి సినిమాలు విడుదల అయితే ఆ రోజు రణరంగమే. అదంతా ఒకప్పుడు కానీ ఇప్పుడు కాలం తో పాటు హీరోలు కూడా మారారు. ఒకరి ఫ్యామిలీ హీరోల ఫంక్షన్ లకి మరొక ఫ్యామిలీ హీరోలు వెళ్తున్నారు ..ఎంతో సందడి చేస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న చిత్ర ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ వెళ్లి ఎంతో సందడి చేసిన విషయం కూడా తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి దర్సకత్వంలో మల్టీస్టారర్ చిత్రం చేయబోతున్నారనే వార్త ఎన్ని సంచనాలని సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే.

ఇక అసలు విషయానికొస్తే ఇప్పుడు మరో సంచలనమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఎన్టీఆర్ సినిమాకి ఏకంగా పవన్ కళ్యాణ్ నిర్మాత అని సోషల్ మీడియాలో ఈ న్యూస్ హోరెత్తిపోతుంది. అజ్ఞాతవాసి సినిమాతో దెబ్బతిన్నవారిని ఆదుకునే క్రమంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోయే సినిమా కి రాధాకృష్ణ తో పాటు పవన్ కళ్యాణ్ కూడా మరొక చెయ్యి కలుపుతున్నాడంట. అదే కానీ జరిగిందంటే తెలుగు సినిమా మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్లే …ఏమంటారు ?

Leave a comment