Newsకొడుకులిద్దరితో ఎన్.టి.ఆర్.. సర్ ప్రైజ్ పిక్..!

కొడుకులిద్దరితో ఎన్.టి.ఆర్.. సర్ ప్రైజ్ పిక్..!

స్టార్ హీరోల్లో ప్రస్తుతం ఎన్.టి.ఆర్ ఉన్నంత ఆనందంగా ఎవరు లేరని చెప్పాలి. ఓ పక్క వరుస హిట్లతో దూసుకెళ్లడంతో పాటుగా ఈమధ్యనే తన కుటుంబంలోకి ఓ కొత్త వారసుడిని ఆహ్వానించాడు. ఎన్.టి.ఆర్ కొత్త వారసుడి పిక్ చూడాలని ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అయితే సర్ ప్రైజ్ గా తన ఇద్దరి కొడుల ఫోటో తన ఇన్ స్టాగ్రాంలో పెట్టాడు ఎన్.టి.ఆర్.

తన బుల్లి తమ్ముడిని ఎత్తుకుని చైర్ లో కూర్చున్న అభయ్ రామ్ ను ఫోటో తీస్తూ కనిపించాడు ఎన్.టి.ఆర్. ఈ పిక్ చూసి నందమూరి ఫ్యాన్స్ అంతా ఎంతో సంతోషపడుతున్నారు. నిజమైన ప్రేమకు అర్ధం అంటూ చాలామంది కామెంట్ల రూపంలో పెడుతున్నారు. మొత్తానికి ఎన్.టి.ఆర్ తన ఇద్దరి కొడుల పిక్ తో ఫ్యాన్స్ కు భలే గిఫ్ట్ ఇచ్చాడు.

ప్రస్తుతం త్రివిక్రం తో అరవింద సమేత సినిమా చేస్తున్న తారక్ అక్టోబర్ లో ఈ సినిమా రిలీజ్ చేసి ఆ తర్వాత రాజమౌళి మల్టీస్టార్ సినిమాలో నటించనున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news