Newsగూగుల్ సాక్షిగా యంగ్ టైగర్ ఎన్టీఆరే నెంబర్ వన్.. తారక్ ఫాన్స్...

గూగుల్ సాక్షిగా యంగ్ టైగర్ ఎన్టీఆరే నెంబర్ వన్.. తారక్ ఫాన్స్ కి పండగ లాంటి న్యూస్ !!

నాన్నకు ప్రేమతో ,జనతా గ్యారేజ్…సినిమాలు 2016 వ సంవత్సరానికి ఎన్టీఆర్ ని అన్ని రంగాలలో నెంబర్ వన్ గా నిలిపాయి.అయితే అంతకు మించి ఈరోజు గూగుల్ ప్రకటించిన ఎక్కువగా సెర్చ్ చేసిన తెలుగు స్టార్స్ లో నెంబర్ వన్ గా నిలిచాడు. ఇది నిజంగా ఎన్టీఆర్ ఫాన్స్ కి పండగలాంటి వార్తే. ఎందుకంటే ఎన్నో ఏళ్ళు గా ఎదురుచూస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ కొట్టటమే కాకుండా ఇటు ప్రేక్షకుల హృదయాల్లో కూడా నెంబర్ వన్ గా నిలవటం నిజంగా సెలెబ్రేట్ చేసుకోవలసిన విషయం. ఇక జనతా గ్యారేజ్ తో ఎన్టీఆర్ సాధించిన రికార్డులను కూడా ఒకసారి చూడండి. జనతా గ్యారేజ్ సినిమాతో ఇటు యూట్యూబ్ రికార్డ్స్ నుంచి మొదలుకొని థియేటర్లలో కలెక్షన్ల మోత మోగించి చివరకు బుల్లితెరని కూడా గడ గడ లాడించాడు. వివరాల్లోకి వెళితే
ntr google trends
ntr
allu arjun
pawan kalyan
mahesh babu
ram charan

> జూలై 16 2016 న రంజాన్ సందర్భంగా విడుదలైన 34 సెకండ్ల టీజర్ తక్కువ సమయంలో ఎక్కువ మంది చూసిన టీజర్ గా అదేవిధంగా ఎక్కువ లైక్ లు సాధించిన టీజర్ గా రికార్డులు నెలకొల్పింది.

> ఇక ఆగష్టు 12, 2016 న విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అయితే ప్రభంజనమే సృష్టించింది ఇది కూడా ఎక్కువ మంది చూసిన టీజర్ గా అదేవిధంగా ఎక్కువ లైక్ లు సాధించిన టీజర్ గా రికార్డులు నెలకొల్పింది. అంతే కాకుండా సినిమాపై విపరీతమైన అంచనాలను పెంచేసింది.

> సెప్టెంబర్ 1, 2016 న ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది.. రిలీజ్ అయిన రోజున ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లతో రికార్డులు రిపేర్ చేసింది. అలాగే వరల్డ్ వైడ్ గా 2016 సంవత్సరానికి అత్యధిక కలెక్షన్లతో మొదటిస్థానంలో నిలిచింది(All Time 3rd Place).

> ఇక అక్టోబర్ 23, 2016 న టెలివిజన్ లో మొదటిసారిగా ప్రసారం అయ్యి 20.69 TRP రేటింగుతో అంతకు ముందు రికార్డులని కూడా బద్దలు కొట్టింది. ఇక ట్విట్టర్ ట్రెండింగ్స్ విషయంలో మరియు వీడియో సాంగ్స్ విషయంలో కూడా మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తూ 2016 సంవత్సరానికి నెంబర్ వన్ స్థానంలో నిలిచింది యంగ్ టైగర్ జనతా గ్యారేజ్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news