మళ్లీ వారసుడే.. ఎన్.టి.ఆర్, ప్రణతిలకు రెండో సంతానం..ఆనందంతో ఎన్టీఆర్ ట్వీట్

ntr-baby-boy

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మరోసారి తండ్రయ్యాడు. ఎన్.టి.ఆర్, లక్ష్మి ప్రణతిల రెండో సంతానంగా కొడుకు పుట్టినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఎన్.టి.ఆర్ తన ట్విట్టర్ ద్వారా వెళ్లడించడం జరిగింది. తన ఫ్యామిలీ ఇంకాస్త పెద్దదవుతుంది మళ్లీ బాబు పుట్టాడు అంటూ వెళ్లడించాడు ఎన్.టి.ఆర్.

ఈ విషయం తెలియడంతో నందమూరి ఫ్యాన్స్ అంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఎన్.టి.ఆర్, ప్రణతిలకు మొదటి సంతానంగా అభయ్ రామ్ పుట్టాడు. ఇక మళ్లీ వారసుడే పుట్టినందుకు కుటుంబసభ్యులంతా సంతోషిస్తున్నారు. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ త్రివిక్రం డైరక్షన్ లో అరవింద సమేత సినిమా చేస్తున్నాడు.

Leave a comment