ఇన్ స్టాగ్రాంలోకి యంగ్ టైగర్..కొన్ని గంటల్లోనే .. అదిరిపోయే రికార్డు!

ntr-instagram

ఒకప్పుడు స్టార్స్ తో మాట్లాడాలి అంటే అదో గొప్ప వరమని భావించే వారు. కలవడం పక్కన పెడితే మాట్లాడటం అనేది చాలా ఈజీ అయ్యింది ఇప్పుడు. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు స్టార్స్ తమ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటున్నారు. ముఖ్యంగా ట్విట్టర్ తో తమ అప్డేట్స్ తో వస్తున్న స్టార్స్ కొత్తగా వచ్చిన ఇన్ స్టాగ్రాంలో కూడా తమ ఫోటోస్, వీడియోస్ తో ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇస్తున్నారు.

ఈ విధంగా కూడా తమ ఫాలోవర్స్ ను పెంచుకునే ఆలోచనలో ఉన్నారు. ఈ క్రమంలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొద్ది గంటల క్రితం ఇన్ స్టాగ్రాంలో జాయిన్ అయ్యాడు. తన అఫిషియల్ ఇన్ స్టాగ్రాం ఎకౌంట్ ఓపెన్ చేశాడు తారక్. ప్రస్తుతం తను చేస్తున్న త్రివిక్రం మూవీ అరవింద సమేత పోస్టర్ తో మొదటి ఇన్ స్టాగ్రాం పిక్ షేర్ చేశాడు తారక్.

ఇప్పటికే ట్విట్టర్ లో 2 మిలియన్స్ కు పైగా ఫాలోవర్స్ సాధించిన ఎన్.టి.ఆర్ ఇన్ స్టాగ్రాం మొదలుపెట్టి రెండు గంటలు కూడా కాలేదు దగ్గర దగ్గరగా 1 లక్షఫాలోవర్స్ ను ఏర్పరచుకున్నాడు. దీన్ని బట్టే చెప్పొచ్చు ఎన్.టి.ఆర్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో మరి ఇన్ స్టాగ్రాంలో ఎన్.టి.ఆర్ ఎంట్రీ ఎలాంటి సర్ ప్రైజెస్ ను ఫ్యాన్స్ కు అందించేలా ఉంటుందో చూడాలి.

https://www.instagram.com/tarak9999official/

Leave a comment