Gossipsఎన్టీఆర్ కు ఎదురేలేదు.. అరవింద సమేతను ఆపేదెవరు...!

ఎన్టీఆర్ కు ఎదురేలేదు.. అరవింద సమేతను ఆపేదెవరు…!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత సినిమా దసరా బరిలో అక్టోబర్ 11న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తుంది.

సినిమాలో ఎన్.టి.ఆర్ రాయలసీమ యాసలో మాట్లాడతాడట. సిక్స్ ప్యాక్ తో ఫస్ట్ లుక్ తోనే రచ్చ చేసిన తారక్ సినిమాపై భారీ అంచనాలు పెంచాడు. ఇక ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో అరవింద సమేత కాకుండా మరో పెద్ద సినిమా రిలీజ్ అవడం కష్టమే అని తెలుస్తుంది. చరణ్, బోయపాటి సినిమా సెట్స్ మీద ఉన్నా అది సంక్రాంతికే టార్గెట్ పెట్టినట్టున్నారు.

ఇక స్టార్ హీరోల ఎవరి సినిమాలు షూటింగ్ మొదలుపెట్టలేదు. కాబట్టి అరవింద సమేతకు ఇక ఎదురేలేదని చెప్పొచ్చు. దసరా బరిలో దర్జాగా రాబోతున్న తారక్ ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి. పెద్ద సినిమాలు మూడు నెలలు గ్యాప్ తో వస్తే కచ్చితంగా రాబోయే పెద్ద సినిమాకు మంచి క్రేజ్ వస్తుంది. చూస్తుంటే అరవింద సమేతకు 5 నెలలు గ్యాప్ వచ్చేట్టు ఉంది. కచ్చితంగా ఇది ఎన్.టి.ఆర్ సినిమాకు కలిసి వచ్చే అంశమే అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ లో చిన్న చితకా సినిమాలు వస్తున్నాయి. అవేవి ఎన్.టి.ఆర్ సినిమాకు పోటీ ఇవ్వలేవు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news