Gossipsఅరవింద సమేత.. అప్పుడే రికార్డులు మొదలుపెట్టింది..!

అరవింద సమేత.. అప్పుడే రికార్డులు మొదలుపెట్టింది..!

టెంపర్ నుండి తన ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్త పడుతున్న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ టెంపర్ నుండి తన విజయ పరంపరని కొనసాగిస్తున్నాడు. టెంపర్ నుండి లాస్ట్ ఇయర్ వచ్చిన జై లవ కుశ దాకా తారక్ రేంజ్ సినిమాకు సినిమాకు పెరుగుతూ వచ్చింది. ఇక రాబోతున్న త్రివిక్రం డైరక్షన్ లో మూవీపి అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.

అంచనాలకు తగినట్టుగానే అరవింద సమేత అని టైటిల్ పెట్టారు. ఇక అప్పుడే ఈ సినిమా రికార్డులను సృష్టిస్తుంది. సినిమా అలా టైటిల్ ఎనౌన్స్ చేశారో లేదో ఇలా ఓవర్సీస్ లో సినిమా డీల్ సెట్ అయ్యింది. ఏకంగా 11 కోట్లకు అరవింద సమేత ఓవర్సీస్ రైట్స్ అమ్ముడయ్యాయట. ఎన్.టి.ఆర్ కెరియర్ లో ఎప్పుడూ లేని విధంగా ఓవర్సీస్ ప్రైజ్ వచ్చింది.

త్రివిక్రం సినిమాలకు ఓవర్సీస్ లో డిమాండ్ బాగా ఉంటుంది. యంగ్ టైగర్ లాంటి హీరోతో అరవింద సమేత సినిమా వస్తుండటంతో ఆటోమేటిక్ గా సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అందుకే 11 కోట్ల దాకా రైట్స్ వచ్చాయి. ఇప్పుడు తెలుగు సినిమా కలక్షన్స్ లో ఓవర్సీస్ రైట్స్ ఎక్కువ పాత్ర పోశిస్తున్నాయి. కాబట్టి ఎన్.టి.ఆర్ ఈసారి ఓవర్సీస్ లో కూడా తన సత్తా చాటుతాడని చెబుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news