” యాత్ర ” మూవీ ఆఫీషియల్ టీజర్ (తెలుగు)..

3

యాత్ర టీజర్.. జగన్ పర్ఫెక్ట్ బర్ డే గిఫ్ట్..!

ఓ పక్క ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా సందడి మొదలవగా సెట్స్ మీద ఉన్న వై.ఎస్ బయోపిక్ యాత్రకు సంబందించి కూడా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. మహి వి రాఘవ్ డైరక్షన్ లో వస్తున్న ఈ యాత్ర మూవీలో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డిగా మళయాల స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తున్నాడు. వై.ఎస్ పాదయాత్ర నేపథ్యంతో వస్తున్న ఈ సినిమాకు టైటిల్ గా కూడా యాత్ర అని పెట్టారు. 70 ఎం.ఎం ఎంటర్టైన్ మెంట్స్ లో విజయ్ చిల్లా, శషి దేవిరెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు.

ఈరోజు వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్ డే సందర్భంగా యాత్ర టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో పాదయాత్రలో వై.ఎస్ రైతుల కష్టాలను గురించి తెలుసుకోవడం.. వారికి ఆయన హామీ ఇవ్వడం గురించి చూపించారు. పాదయాత్రతో ప్రజల మనసు గెలుచుకుని సిఎంగా అఖండ విజయం సాధించిన వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానికి సంబందించి సీన్స్ ఇందులో ఉంటాయని తెలుస్తుంది.

ఫిబ్రవరి 8న ఈ సినిమా రిలీజ్ కానుంది. మమ్ముట్టితో పాటుగా థర్టీ ఇయర్స్ పృధ్వి కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. వై.ఎస్ బయోపిక్ గా వస్తున్న ఈ యాత్ర వై.ఎస్ అభిమానులను మెప్పించేలా తీస్తున్నారు. మరి అది ఎలా ఉంటుంది అన్నది తెలుసుకోవాలంటే రిలీజ్ దాకా వెయిట్ చేయాల్సిందే.

Leave a comment