అజ్ఞాతవాసిగా మారుతానంటున్న అరవింద సమేత.. సేమ్ టు సేమ్!

50

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం ఎలాంటి రిజల్ట్‌ను సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్ర టీజర్ రిలీజ్ అయినప్పుడు మాత్రం మామూలు రచ్చ చేయలేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఒక కుర్చీని తిప్పిన విధానం.. అబ్బో అది టీజర్ మొత్తానికే హైలైట్ అని చెప్పాలి. ఈ టీజర్‌తో సినిమాపై అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. కట్ చేస్తే.. ఆ కుర్చీ సీన్ సినిమాలో పెద్దగా చేసింది ఏమీ లేదు. ఫలితంగా సినిమా బాక్సాఫీస్ దగ్గర బక్కెట్ తన్నేసింది.

ఇప్పుడు ఇదే సీన్ మరోసారి రిపీట్ కానుందా..? అంటే అవుననే యాన్సర్ వినిపిస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న అరవింద సమేత వీర రాఘవ చిత్ర టీజర్‌ను స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఆగష్టు 15న ఉదయం 9 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో ఎన్టీఆర్ అదే కుర్చీమీద కూర్చుని దుండగుల పని పడుతున్నాడు. అజ్ఞాతవాసిలో చూపించిన కుర్చీను పోలిన కుర్చీలోనే తారక్ కూర్చుని ఉన్నాడు. మరి ఈ కుర్చీ సెంటిమెంట్‌ను త్రివిక్రమ్ మళ్లీ ఎందుకు రిపీట్ చేస్తున్నాడా అంటూ తారక్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.

కాగా కొంతమంది మాత్రం తారక్ దెబ్బకు టీజర్ మాత్రమే కాదు సినిమా కుడా కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అని అంటున్నారు. మరి ఈసారైనా కుర్చీ విరగకుండా ఉంటే అదే చాలు అని త్రివిక్రమ్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. చూద్దాం.. ఏం జరుగుతుందో!

Leave a comment