Moviesమంచు లక్ష్మి ' వైఫ్ ఆ రామ్' రివ్యూ & రేటింగ్

మంచు లక్ష్మి ‘ వైఫ్ ఆ రామ్’ రివ్యూ & రేటింగ్

మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో విజయ్ యలకంటి డైరక్షన్ లో వచ్చిన సినిమా వైఫ్ ఆ రామ్. సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా కథ కథనాలతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

భర్త చనిపోయిన తర్వాత అది మర్డర్ అని గుర్తించిన దీక్ష (మంచు లక్ష్మి) ఆ మర్డర్ ఎవరు చేశారన్నది ఛేధించే ప్రయత్నం చేస్తుంది. అందులో ఆడియెన్స్ ను థ్రిల్ ఫీలయ్యే ట్విస్టులు, సస్పెన్స్ లు ఉంటాయి. కథ ఫ్లాట్ గా అనిపించినా పక్కా స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీగా వచ్చింది వైఫ్ ఆఫ్ రామ్. మరి దీక్ష భర్తను చంపింది ఎవరు..? అసలు అతన్ని ఎందుకు చంపాల్సి వచ్చింది..? జరిగిన కథే సినిమా.

నటీనటుల ప్రతిభ :

దీక్ష పాత్రలో మంచు లక్ష్మి నటన ఓకే. అయితే సినిమా మొత్తం తన చుట్టే తిరుగుతుంది కాబట్టి ఆమెను సినిమా మొత్తం చూసేంత నటన కనబరచలేదు. కొన్ని ఎమోషనల్ గా పండించాల్సిన సీన్స్ పేలవంగా అనిపిస్తాయి. ప్రియదర్శి కానిస్టేబుల్ రోల్ లో బాగానే చేశాడు. నెగటివ్ షేడ్స్ లో ఆదర్శ్ కనిపించి అలరించగా.. రామ్ పాత్రలో సామ్రాట్ ఉన్నది కొద్ది సేపే అయినా ఆకట్టుకున్నడు.

సాంకేతికవర్గం పనితీరు :

సినిమాను పాటలు లేకుండా తీయాలనుకోవడం పెద్ద సాహసమే.. అలాంటప్పుడు టైట్ స్క్రీన్ ప్లే కావాలి. అయితే పాటలు లేకున్నా థ్రిల్లర్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుండాలి. రఘు దీక్షిత్ ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. భాస్కర్ సామల సినిమాటోగ్రఫీ బాగుంది. తమ్మిరాజు ఎడిటింగ్ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. దర్శకుడు విజయ్ స్క్రీన్ ప్లే ఇంకాస్త గ్రిప్పింగ్ గా రాసుకుని ఉంటే బాగుండేది. కథ, కథనాలు బాలీవుడ్ కహాని సినిమాకు పోలి ఉంటాయి.

విశ్లేషణ :

మర్డర్ మిస్టరీ సినిమాగా వచ్చిన వైఫ్ ఆఫ్ రామ్ పక్కా స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ అని చెప్పొచ్చు. సినిమా కథ ముందే తెలియడంతో ఆ కథను నడిపించే కథనం కొత్తగా ఉండాలి. అయితే ఇందులో దర్శకుడు విజయ్ కొత్తగా ప్రయత్నించినా ఆర్టిస్టు పర్ఫార్మెన్స్ తేలిపోవడంతో ఆడియెన్స్ కు అంతగా కనెక్ట్ అవలేదు.

ఎంచుకున్న కథను రెండు గంటలు లాగించడంతో దర్శకుడు అక్కడక్కడ మిస్టేక్స్ చేశాడు. సినిమాలో మంచు లక్ష్మి శక్తిమేర నటించినట్టుగా అనిపించినా ఎందుకో ఆమె కన్నా వేరే ఇంకెవరైనా అయ్యుంటే బాగుండేదని అనిపిస్తుంది.

సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ఆ జానర్ సినిమాలు చూసే ఆడియెన్స్ కు ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. అయితే యూత్ ఆడియెన్స్ కనెక్ట్ అయ్యే అంశాలు.. ఎంటర్టైన్మెంట్ కూడా మిస్ అవడంతో సినిమా ఆడియెన్స్ కు ఏమాత్రం నచ్చుతుందో చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

కథ

బ్యాక్ గ్రౌండ్ స్కోర్

సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

మంచు లక్ష్మి

స్క్రీన్ ప్లే

మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్

బాటం లైన్ :

వైఫ్ ఆ రామ్.. ఓ విఫల ప్రయత్నం..!

రేటింగ్ : 2/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news