ఆకట్టుకుంటున్న మంచులక్ష్మి ”w/o రామ్’

wife-of-ram-first-look

మొదటి నుంచి కూడా లక్ష్మి మంచు విభిన్నమైన పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్నారు. తాజాగా ఆమె చేసిన చిత్రమే ”w/o రామ్’.విజయ్‌ ఏలకంటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆదర్శ్‌, కృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రంలో దీక్షగా నటిస్తున్న మంచు లక్ష్మి ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.థ్రిల్లర్ నేపథ్యంలో కొనసాగే ఈ సినిమాలో ఆమె ‘దీక్ష’ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రాన్ని జూన్‌లో విడుదల చేయనున్నారు.

Leave a comment