Gossipsఆ వెబ్సైటుకు ఎన్టీఆర్ పై అంత కోపం ఎందుకు ?

ఆ వెబ్సైటుకు ఎన్టీఆర్ పై అంత కోపం ఎందుకు ?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన జై లవ కుశ సూపర్ సక్సెస్ సాధించడం, ఎన్టీఆర్  వరసగా 4 వ సారి బాక్స్ ఆఫీస్ వద్ద 50 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన చిత్రంగా జై లవ కుశ నిలవడంతో  నిన్న “జై లవ కుశ విజయోత్సవం ” పేరిట సక్సెస్ మీట్ పెట్టారు జై లవ కుశ టీం.

పోసాని గారు మొదలుకొని టెక్నిషన్స్ ,డిస్ట్రిబ్యూటర్స్ , ఆర్టిస్ట్స్ , ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ వరకు అందరూ ఎన్టీఆర్ నటనాభీభత్సం గురించి చెప్పారు .ఇలా అంతా సక్సెస్ ని పలువురికి ప్రశంసలతో , ధన్యవాదాలతో సెలెబ్రేట్ చేసుకున్నారు నిన్న జరిగిన సక్సెస్ మీట్ లో .

కానీ ఎన్టీఆర్ మాత్రం ఎప్పుడు లేని విధంగా స్పందించారని చెప్పాలి . ఈ చిత్రాన్ని సూపర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకి ధన్యవాదాలు చెప్పుతూ మొదలుపెట్టి తన  స్పీచ్ తో  కొన్ని కాంట్రవర్సీ యాస్పెక్ట్స్ ని టచ్ చేసారు ఎన్టీఆర్ . క్రిటిక్స్ ని దారిన పోయి దానయ్యగా సంబోధించారు ఆయన. దానికి కారణమూ లేక పోలేదు . పలు పెద్ద వెబ్సైట్లు  ఈ చిత్రానికి తక్కువ రేటింగ్ ఇచ్చినా ప్రేక్షకులు మాత్రం వాటిని పెద్దగా పాటించుకోలేదు . అదే ఎన్టీఆర్ ఒక పిట్టా కదా రూపం లో వివరించారు . దానికి క్రిటిక్స్ పై విరుచుకు పడ్డ ఎన్టీఆర్ అని ఆయనకు కొత్త కాంట్రవర్సీ టాగ్ తగిలించే ప్రయతనం  చేసింది ఒక ప్రముఖ వెబ్సైటు. నిజానికి ఎన్టీఆర్ అన్న మాటల్లో వాస్తవం లేకపోలేదు . మొన్న వచ్చిన అల్లు అర్జున్  ‘DJ ‘  చిత్రంకు గాని ఆ సో కాల్డ్ క్రిటిక్స్ ఇచ్చిన రేటింగ్ కి బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా పెర్ఫార్మన్స్ కి సంబంధం లేదన్న విషయం గ్రహించాలి.

నిజానికి మన టాలీవుడ్ న్యూస్ కి సంబంధించి చాలావెబ్సైట్స్ వున్నాయి అయితే వాటిలో మెజారిటీ సైట్స్ జై లవ కుశ సినిమాకి 3 నుంచి 3 .75 వరకు రేటింగ్స్ ఇచ్చాయి. అయితే పాపులర్ సైట్స్ గా ఫీల్ అయ్యే ఒకటి రెండు సైట్స్ మాత్రం వారి ప్రత్యేకత చాటుకోవాలనో ఏమో కానీ 3 కంటే తక్కువ రేటింగ్ ఇచ్చాయి. అంటే మిగిలిన అన్ని సైట్స్ లో రివ్యూ రాసే క్రిటిక్స్ కి నచ్చిన సినిమా ఈ ఒకటి రెండు సైట్స్ లో రివ్యూ రాసే క్రిటిక్స్ కి మాత్రమే నచ్చలేదా ?

అయితే  ఎన్టీఆర్ పర్టికులర్ గ టార్గెట్ చేసిన వెబ్సైటు ఏది అనే దాని పైన డిబేట్స్ జరుగుతున్నాయి . సోషల్ మీడియాలో ఆ ప్రముఖ వెబ్సైటు పేరు కూడా చక్కర్లు కొడుతుంది డిస్కషన్స్ లో . ఆ వెబ్సైటుకు  ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తూ మరో రాజకీయ పార్టీ పై కుల పరమైన కామెంట్స్ చేస్తూ విషం కక్కడం అలవాటుగా మారిందని సోషల్ మీడియాలో చాల కామెంట్స్ వస్తున్నాయి . దానికి బలం చేకూరుస్తూ ఆ వెబ్సైటు  ఎన్టీఆర్ మాట్లాడిన ఘంట గడవక ముందే  ఎన్టీఆర్ పై విషం చిమ్ముతూ మరో ఆర్టికల్ కూడా రాసేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news