ఫీలింగ్స్ : స‌మంతా ఎందుకీ క‌న్నీరు

samantha pj

అమ్మ‌,నాన్న‌ల‌ను ఇలా త‌ల్చుకుంటున్నా..జ‌న్మ‌లో మ‌రో జ‌న్మ ఇచ్చిన నా ప్రేమ‌నీ ‌త‌ల్చుకుంటున్నా .. త‌ల‌దించిన వేళ ఎందుకీ క‌న్నీరు.. ఓ బంధం నాతో న‌డిస్తోంది. ఓ బంధం గ‌త కాల జ్ఞాప‌కమై వెన్నా డుతోంది.దీవిస్తోంది.దేవ‌త‌ల్ని ఇలా వేడుకుంటాను..ఇంత‌కుమించిన వ‌రం వ‌ద్ద‌ని..చ‌ర్చి గంట‌లు మో గుతున్నాయి..ఆ..ప్రార్థ‌న ప‌ర‌మార్థం మ‌నుష‌లంతా ఒక్క‌టే క‌దా! ఔను! నేను మ‌నిషిని మ‌నిషినే ప్రే మిస్తాను.ప్రేమని ప్రేమిస్తాను..ఈ క్ష‌ణం ఇలా శాశ్వ‌త‌మ‌వ్వాల‌ని కోరుకుంటాను.

 

నా త‌ల్లీ..తండ్రీ.. దీవెన‌ లు ఈ సాగ‌ర ఘోష‌లో మృదుమ‌ధురంగా విన‌వ‌స్తున్నాయి.ఈ తీరం నాకో గొప్ప అన‌భూతిని మిగు లుస్తోంది.మ‌రో తీరానికి చేరుకునేందుకు నాంది ఇది. స‌మంతా ఎందుకీ క‌న్నీరు అని అంటోంది మ‌న‌ సు. ఏం చెప్ప‌ను..మౌనం మంత్రం అయ్యాక‌.. మాట మంత్రం అయ్యాక వేదం నాదం నాలో ఇమిడిపో యాక‌.. ప్రేమ క‌న్నా మించిన వేదం ఏది అని.. ఆ క‌వితాక్ష‌రాలే నాకో నాదం.. ఇంకా ఇంకా గుర్తు ఆ.. తొలి రోజు ఆ..తొలి చూపు..ఇంకా ఇంకా..గుర్తు తొలి క్లాప్ తొలి ఫ్రేమ్‌.. అన్నీ అన్నీ దాటుకుని ఇక్క‌డి కి..ఇ క్క‌డి నుంచి ఇంకా ఎంతో దూరం.. చై తో నా ప్ర‌యాణం . దీవించ‌గ రారండి దిగ్విజ‌యం కావాల‌ని ..
– ఇట్లు మీ సమంతా అక్కినేని

Leave a comment