మెగా ఫైట్ లో గెలుపెవరిది..?

varuntej-sai-dharam-tej

మెగా ఫ్యామిలీ నుండి అందరు హీరోలుగా ఎంట్రీ ఇస్తుండటంతో ఒక హీరో సినిమా మరో హీరో సినిమా పోటీ వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటివరకు అది జరుగలేదు కాని ఈ శుక్ర, శని వారాల్లో యువ మెగా హీరోలు ఇద్దరు తమ సినిమాలతో పోటీ పడుతున్నారు. మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ ఇంటిలిజెంట్ అంటూ వస్తుండగా.. వరుణ్ తేజ్ మాత్రం తొలిప్రేమగా రాబోతున్నాడు.

వినాయక్ డైరక్షన్ ఇంటిలిజెంట్ మూవీ ఓ మాస్ ఎంటర్టైనర్ గా వస్తుంది. జవాన్ తర్వాత తేజ్ చేసిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ట్రైలర్ కూడా ధర్మా భాయ్ గా సాయి ధరం తేజ్ అదరగొట్టాడు. అయితే ఈ సినిమాకు పోటీగా వరుణ్ తేజ్ తొలిప్రేమ ఓ రీఫ్రెషింగ్ లవ్ స్టోరీతో వస్తుంది. వెంకీ అట్లూరి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. లవ్ స్టోరీ కాబట్టి లీడ్ పెయిర్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.

రెండు సినిమాలకు మంచి బజ్ ఏర్పడింది. అయితే ఇంటిలిజెంట్ కాస్త ఎక్కువ హడావిడి చేస్తున్నట్టు అనిపిస్తుంది. అయితే యూత్ ఆడియెన్స్ మాత్రం తొలిప్రేమ సినిమా మీద దృష్టి పెట్టారు. ఫిదా లాంటి హిట్ తర్వాత వరుణ్ తేజ్ సినిమాగా వతున్న ఈ తొలిప్రేమ ఎలా ఉంటుందో అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు మెగా ఫ్యాన్స్. అసలే పవర్ స్టార్ టైటిల్ కాబట్టి సినిమాపై ఆటోమేటిక్ గా అభిమానుల అంచనాలు ఉన్నాయి. మరి ఈ రెండు సినిమాల ఫైట్ లో ఎవరిది పై చేయి అవుతుంది అన్నది చూడాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.

Leave a comment