Gossipsఎవరు బెస్ట్ డ్యాన్సర్..? రాజు సుందరం షాకింగ్ ఆన్సర్...!

ఎవరు బెస్ట్ డ్యాన్సర్..? రాజు సుందరం షాకింగ్ ఆన్సర్…!

టాలీవుడ్ హీరోలలో డ్యాన్సర్స్ కి కొదవేలేదు. నాటి చిరంజీవి తరం నుండి నేటి సాయిధరమ్ తేజ్ తరం వరకు మంచిగా  డ్యాన్స్ చేసే వారి లిస్ట్ చాల పెద్దది . ఎన్టీఆర్ , రామ్ చరణ్ , అల్లు అర్జున్ , రామ్, సాయిధరమ్ , అఖిల్ , సునీల్ ప్రస్తుతం ఉన్నవారిలో డ్యాన్స్ బాగా చేసే హీరోలు . అయితే వీరిలో అతి కొద్దీ మందికే గ్రేస్ ఉంటుందని సగటు  ప్రేక్షకుడి  అభిప్రాయం. పైగా స్టార్ ఇమేజ్ ఉన్నవాళ్ళ డ్యాన్స్ నే ఎక్కువగా ఇష్టపడతారు ప్రేక్షకులు.

ప్రభు దేవా సోదరుడు  రాజు సుందరం తెలుగులో చాల సినిమాలకు డ్యాన్స్ కంపోజ్  చేసారు . పైన చెప్పిన లిస్ట్ లో అందరితోనూ  ఆయన పని చేసారు. రీసెంట్ గా రాజు సుదరం ఒక ఇంటర్వ్యూ లో టాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్ ఎవరని యాంకర్ అడిగిన ప్రశ్న కు షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు .

బెస్ట్ అంటే ఎన్టీఆర్ & బన్నీ అని చెప్పారు. అయితే, ఒక స్టెప్ ను కంపోజ్ చేసిన తర్వాత ఆ స్టెప్ ని అల్లు అర్జున్ చాలా సార్లు ప్రాక్టీస్ చేస్తారు. ఆ తర్వాత ఆ స్టెప్ ని పర్ఫెక్ట్  గా చేస్తారు. తారక్ అలాకాదు, రిహార్సల్స్ వంటివి ఏవీ ఉండవు. ఒకసారి స్టెప్ ని కంపోజ్ చేయగానే వెంటనే చేసేస్తారు. ఫైనల్ గా ఇద్దరు పర్ఫెక్ట్  గా డ్యాన్స్ చేస్తారని చెప్పుకొచ్చారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news