Bhaktiదీపావళి 2018: ఏ ఏ సమయాల్లో లక్ష్మి పూజ చేస్తే మంచిది..?

దీపావళి 2018: ఏ ఏ సమయాల్లో లక్ష్మి పూజ చేస్తే మంచిది..?

దీపావళి ప్రపంచవ్యాప్తంగా హిందువులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి. దీపావళి 2018 భారతదేశంలోని అనేక ప్రాంతాలలో నవంబర్ 7 వ తేదీన, నవంబర్ 6 న దక్షిణ భారతదేశంలోని కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో జరుపుకోబోతున్నారు. సింగపూర్లో నివసిస్తున్న హిందువులతో పాటు ఈ మూడు దేశాలతో కూడా నవంబర్ 6, 2018 న దీపావళిని జరుపుకుంటున్నారు.ఇక దీపావళి సందర్భంగా లక్ష్మి పూజ సాయంత్రం 5.57 నుండి 7.53 గంటల లోపు నిర్వహించాలని పండితులు చెబుతున్నారు. ఇలా చేస్తే ఆ ఇల్లు ఎల్లప్పుడూ ధనం మరియు సంతోషం తో నిండి ఉంటుందని వారి నమ్మకం.
1
ఈ దీపావళి వేడుకలు సాధారణంగా ఐదు రోజుల పాటు ఉంటాయి, వాటిలో మూడవ రోజు ప్రధాన రోజు. ‘చెడు మీద మంచి విజయం’ మరియు ‘చీకటి మీద విజయం సాధించిన’ గుర్తుగా ఈ పండుగ జరుపుకుంటారు. ఈ పండుగ హిందూ క్యాలెండర్ ప్రకారం, కార్తీక మాసంలో వస్తుంది. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం, ఈ పండుగ అక్టోబర్ లేదా నవంబర్ నెలలలో వస్తుంది.
2
దీపావళికి ముందు రోజుల్లో కొత్త వస్తువులను కొనడం పవిత్రంగా భావిస్తారు. హిందువులు ఈ పండుగ ముందు తమ ఇంటిని శుభ్రం చేసుకోవడం పాత ఫర్నిచర్ రిపేర్ చేయడం , కొత్త బట్టలు, కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేయడం వంటివి చేస్తారు. దీపావళి రోజున ప్రభుత్వం సెలవు కూడా ప్రకటించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news