Gossipsబిగ్ బాస్ లో గెలిచినా ప్రైస్ మనీ ని శివ బాలాజి...

బిగ్ బాస్ లో గెలిచినా ప్రైస్ మనీ ని శివ బాలాజి ఏం చేశాడో తెలుసా ..!

బిగ్ బాస్ తెలుగులో మొదటి సీజన్ విన్నర్ గా ప్రైజ్ మనీ గెలుచుకున్న శివ బాలాజి ఆ మొత్తం ఎమౌంట్ అనాధలకు విరాళం అందించి అందరి మనసులు గెలుచుకున్నాడు. ఎన్.టి.ఆర్ హోస్ట్ గా స్టార్ మాలో నిర్వహించిన బిగ్ బాస్ రియాలిటీ షోలో శివ బాలాజి ఎంతో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక మొదట్లో కాస్త కోపం చూపించిన శివ బాలాజి ఫైనల్ గా బిగ్ బాస్ సీజన్ వన్ విన్నర్ అయ్యాడు.

గెలిచిన మొత్తం ట్యాక్సులతో కలిపి 35 లక్షలు అందుకున్న శివ బాలాజి ఆ మొత్తాన్ని అనాథ ఆశ్రమానికి విరాళంగా ఇచ్చి తన మంచి తనం చాటుకున్నాడు. 70 రోజుల పాటు కుటుంబ సభ్యులను వదిలేసి ఎంతో కష్టపడిన శివ బాలాజి గెలిచిన మొత్తాన్ని ఇలా అనాథలకు ఇవ్వడం నిజంగా గొప్ప విషయమని చెప్పాలి. కెరియర్ మొదట్లో హీరోగా సినిమాలు చేసిన శివ బాలాజి ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్ కు పరిమితమయ్యాడు. బిగ్ బాస్ గెలవడమే ఓ సర్ ప్రైజ్ అనగా గెలిచిన మొత్తం విరాళాల రూపంలో అందించిన శివ బాలాజికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news