తారక్ తో గొడవ పెట్టుకున్న కమెడియన్ !

ntr
యంగ్ టైగర్ ఎన్టీఆర్’ని మించినోడు లేడు. తనకు తెలిసిన గొప్ప వ్యక్తుల్లో ఎన్టీఆర్’ని మించినవారు లేనేలేరు అంటున్నాడు కమెడియన్. గతంలో ఎన్టీఆర్-శ్రీనివాస్ రెడ్డిల మధ్య సాన్నిహిత్యం ఉండేది. అయితే, ఇక్కడివి అక్కడ.. అక్కడివి ఇక్కడ చెప్పేవాడనే నెపంతో శ్రీనివాస్ రెడ్డిని తారక్ దూరం పెట్టారనే ప్రచారం కూడా ఫిలిం నగర్ లో జరుగుతోంది.
శ్రీనివాస్ రెడ్డి మాత్రం అవన్నీ ఉత్తిదే అని కొట్టిపారేస్తున్నాడు. నాకు తెలిసిన గొప్ప వ్యక్తుల్లో ఎన్టీఆర్‎ను మించిన వారు లేనేలేరు. నాకు తెలిసిన వాళ్లలో అంతా తనకన్నా తక్కువ రేంజ్ వాళ్ళే.. మరి అలాంటి వాళ్ళతో నేను ఎన్టీఆర్ గురించి చెప్పడం వల్ల నాకు ఒరిగేదు లేదు సరికదా ఆయనకు జరిగే నష్టం అసలే లేదు’. ఇలాంటివన్నీ ప్రచారాలే అంటున్నాడు.
ఈ విషయం గురించి నేను ఎన్టీఆర్‎తో డైరెక్ట్‎గా కూడా మాట్లాడాను. నా గురించి ఏమైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గరకు వచ్చిందా..? అని అడిగా.. దానికి ఆయన అలాంటిదేమీ లేదు అని చెప్పారు. ఇదాంతా కావాలనే మా మధ్య  గొడవలు పెట్టడానికి చూస్తున్నారని ఆయన చెప్పుకొచ్చాడు.

Leave a comment