నంది చెప్పిన నిజం ! ఆ హీరోల మధ్య అంత పగ ఉందా ..?

nandhi

తాజాగా ప్రకటించిన నంది అవార్డులు ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీనే అతలాకుతలం చేసేస్తోంది. ఇప్పటివరకు లోపల ఎన్ని కుట్రలు, కుతంత్రాలు ఉన్నా సరే పైకి మాత్రం అంతా కలిసి మెలసి ఉన్నట్టు కలరింగ్ ఇచ్చేవారు. అయితే అదంతా బయటపడిపోయింది ఇప్పుడు అది కూడా నంది అవార్డుల పుణ్యమా అంటూ.

అవును నంది అవార్డులు ప్రకటించి ఇప్పుడు ఇండ్రస్ట్రీలో కుల , వర్గ పోరు లేపి రాజకీయ నాయకులకంటే తామేమి టాక్కువ కాదు అని నిరూపిస్తున్నారు కొంతమంది సినీ జనాలు. త‌మ‌కు ఎందుకు అవార్డులు ఇవ్వ‌లేద‌ని అడ‌గ‌డం పోయి వాళ్ల‌కు ఎందుకు ఇచ్చారు అనే అడిగే స్థాయికి వ‌చ్చింది ఈ ర‌చ్చ‌. అవార్డుల పుణ్య‌మా అని ఇండ‌స్ట్రీలో ఎన్ని వ‌ర్గాలున్నాయి.. ఎంత చీలిక ఉందనే విష‌యం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో స్ప‌ష్టంగా తేలిపోయింది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోక‌పోయినా ఇండ‌స్ట్రీలో మెగా వ‌ర్గం అనేది ఒక‌టి పూర్తిగా బ‌య‌టికి వ‌చ్చి త‌మ బాధ చెప్పుకుంది.

ఇండ‌స్ట్రీలో తామంతా ఒక్క‌టే అని చెప్పుకునే హీరోల మనస్సులో ఇంత దారుణమైన కుల బేధాలు ఉన్నాయా అనేది ఇప్పుడు ఆశ్చ‌ర్యం ఆశ్చర్యం కలిగిస్తోంది. మెగా ఫ్యామిలీ కోసం అడుగుతున్నారా లేదంటే త‌మ సినిమాల‌కు రాలేద‌ని మెగా హీరోల‌ను అడ్డు పెట్టుకుంటున్నారా అనేది తెలియ‌ట్లేదు. పైగా అవార్డుల మ్యాట‌ర్ వ‌చ్చింది కాబ‌ట్టే ఇండ‌స్ట్రీలో ఇంత వ‌ర్గ‌పోరు న‌డుస్తుందా అనేది ఇప్పుడు తెలుస్తోంది. పైకి మాత్రం అంతా న‌వ్వుకుంటూ మాట్లాడే ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల మ‌ధ్య లోలోప‌ల ఉన్న అస‌లు ఫీలింగ్స్ ఇప్పుడిప్పుడే ప్రేక్షక లోకానికి తెలిసొస్తుంది.

Leave a comment