ఆ సూపర్ టాలెంటెడ్ దర్శకుడితో ఎన్టీఆర్.. మహానటి నిర్మాతలు అదిరిపోయే కాంబో..!

young-tiger-ntr-new-movie

మహానటి సినిమాతో వైజయంతి బ్యానర్ మళ్లీ ట్రాక్ ఎక్కేసిందని చెప్పొచ్చు. కొన్నాళ్లుగా ప్రొడక్షన్ కు దూరంగా ఉన్న వైజయంతి బ్యానర్ మహానటితో తన పూర్వ వైభవాన్ని తెచ్చుకుంది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ 25వ సినిమాను దిల్ రాజుతో కలిసి నిర్మిస్తున్నాడు అశ్వనిదత్. అది పూర్తవ్వక ముందే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో సినిమా ఉంటుందని ఎనౌన్స్ చేశారు.

ఈ నెల లోపే దర్శకుడు ఎవరన్నది చెబుతా అన్నారు అశ్వనిదత్. పరిశ్రమ వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం అశ్వనిదత్ నిర్మాణంలో ఎన్.టి.ఆర్ ఓ తమిళ దర్శకుడితో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఆయన ఎవరో కాదు కుర్ర దర్శకుడు అత్లీ అని అంటున్నారు. రాజు రాణి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన అత్లీ విజయ్ తో తెరి, మెర్సల్ సినిమాలు తీసి స్టార్ డైరక్టర్ అయ్యాడు.

ఇప్పుడు ఆ క్రేజీ డైరక్టర్ తోనే తారక్ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం అత్లీ ఓ తమిళ సినిమా ఒప్పుకున్నాడు అది పూర్తి చేశాక 2019లో తెలుగులో సినిమా చేస్తాడని తెలుస్తుంది. నవరస నటుడికి అరవద్ దర్శకుడు తగిలితే మరి ఈ కాంబినేషన్ లో ఎలాంటి అద్భుతమైన సినిమా వస్తుందో చూడాలి.

Leave a comment