Moviesవినయ విధేయ రామ మొదటి వారం కలక్షన్స్

వినయ విధేయ రామ మొదటి వారం కలక్షన్స్

బోయపాటి శ్రీను, రాం చరణ్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వచ్చిన సినిమా వినయ విధేయ రామ. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటించింది. సంక్రాంతి కానుకగా జనవరి 11న గ్రాండ్ గా రిలీజైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో లేదు. మొదటి షో నుండి ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న వివిఆర్ సినిమా వసూళ్లు మాత్రం బాగానే ఉన్నాయి. బోయపాటి విధ్వంసం ఈసారి రివర్స్ కొట్టగా చరణ్ స్టామినా చూపించేలా ఈ సినిమా వసూళ్లు ఉన్నాయి.

ఇక ఈ సినిమా వారం రోజుల్లో 56.73 కోట్ల షేర్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 92.10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైన వివిఆర్ వారం రోజుల్లో సగం రాబట్టింది. అయితే చరణ్ క్రేజ్ వల్లే ఈ మాత్రం వసూళ్లైనా రాబట్టిందని చెప్పొచ్చు. ఏరియాల వారిగా వినయ విధేయ రామ వారం రోజులు కలక్షన్స్ ఎలా ఉన్నాయో చూస్తే..

నైజాం : 12.06 కోట్లు

సీడెడ్ : 11 కోట్లు

ఉత్తరాంధ్ర : 6.65 కోట్లు

ఈస్ట్ : 4.58 కోట్లు

వెస్ట్ : 3.77 కోట్లు

కృష్ణా : 3.35 కోట్లు

గుంటూరు : 6.05 కోట్లు

నెల్లూరు : 2.62 కోట్లు

ఏపి/తెలంగాణ : 50.08 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా : 5.25 కోట్లు

ఓవర్సీస్ : 1.40 కోట్లు

వరల్డ్ వైడ్ : 56.73 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news