ధర్మా భాయ్ గా ధరం తేజ్.. దమ్ము చూపించేందుకు రెడీ..!

sai dharama tej

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ వినాయక్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ధర్మా భాయ్ అన్న టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. నిన్నమొన్నటి దాకా ఈ సినిమా టైటిల్ ఇంటెలిజెంట్ అని పెడదామని అనుకున్నా వినాయక్ మార్క్ సినిమా టైటిల్ లా అది లేదని మళ్లీ టైటిల్ ను మార్చేశారట. ప్రస్తుతం ధర్మా భాయ్ టైటిల్ పై చిత్రయూనిట్ మొగ్గు చూపారని తెలుస్తుంది.

తిక్క, విన్నర్ తో పాటుగా ప్రత్యేక పాత్ర చేసిన నక్షత్రం సినిమా కూడా ఫ్లాప్ అవ్వగా రీసెంట్ గా వచ్చిన జవాన్ కాస్త పర్వాలేదు అనిపించుకున్నాడు సాయి ధరం తేజ్. ఇక ఆ సినిమా ఇచ్చిన జోష్ తో వినాయక్ సినిమా చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాకు టైటిల్ సినిమాలో దమ్ము ఏంటో తెలుస్తుందని చెప్పొచ్చు.

ఖైది నంబర్ 150 తర్వాత వినాయక్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమాతో పాటుగా తేజ్ కరుణాకరణ్ తో చేస్తున్న సినిమాను కూడా ఈమధ్యనే సెట్స్ మీదకు తీసుకెళ్లాడు సాయి ధరం తేజ్. మొత్తానికి మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేసిన సాయి ధరం తేజ్ రాబోతున్న సినిమాలతో ఆ సక్సెస్ మేనియా కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి.

Leave a comment