Gossips' ఉన్నది ఒకటే జిందగీ ' 3 డేస్ కలెక్షన్స్‌... రామ్...

‘ ఉన్నది ఒకటే జిందగీ ‘ 3 డేస్ కలెక్షన్స్‌… రామ్ జోరు ఎలా వుంది?

రామ్ నటించిన తాజా చిత్రం ‘ఉన్నది ఒకటే జిందగీ’ తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్‌తో దూసుకుపోతుంది .ఈ శుక్రవారం సినిమాహాల్ లో కి వచ్చిన ఈ మూవీ పబ్లిక్ లో మంచి టాక్ తెచ్చుకుంది.తొలి రోజు వరల్డ్‌వైడ్‌గా రూ 3.63 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా రామ్ కెరీర్‌లోనే ఫస్ట్ డే హయ్యస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది.అయితే ఈ సినిమా మొత్తం మూడు రోజులకు వరల్డ్‌వైడ్‌గా రూ 6.72 కోట్ల షేర్ రాభటింది.

ఈ సినిమాకు యూఎస్‌లో కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ప్రీమియర్లతో కలిపి తొలి రోజు మొత్తం 1.78 లక్షల డాలర్లను రాబట్టిన మొత్తం మూడు రోజులకు గాను అదే జోరు కొనసాగించి 97లొకేషన్లలో 91,369 డాలర్లను వసూలు చేసి మొత్తంగా 3.49 లక్షల డాలర్లను ఖాతాలో వేసుకుంది. రామ్‌కు ఓవర్సీస్‌లో ఇవి మంచి వసూళ్లే అనుకోవాలి.
ఈ సినిమాపై ఓవర్సీస్‌లో రిలీజ్‌కు ముందే మంచి బజ్ ఉంది. బజ్‌కు తగ్గట్టుగానే రామ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టాడు. ఇక ప్రస్తుతం వచ్చే శుక్రవారం వరకు థియేటర్లలో మంచి సినిమాలేవి లేకపోవడం కూడా ఈ సినిమాకు కలిసిరానుంది. రామ్ సరసన అనుపమ పరమేస్వరన్, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటించగా శ్రీవిష్ణు కీలకపాత్ర చేశాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news