Gossipsచరణ్ కి విలన్ గా మారిన బాలీవుడ్ హీరో..

చరణ్ కి విలన్ గా మారిన బాలీవుడ్ హీరో..

రామ్‌చ‌ర‌ణ్‌ రంగ‌స్థ‌లం సినిమా త‌ర్వాత బోయ‌పాటి శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేసేందుకు ఒప్పుకున్నా సంగతి తెలిసిందే. ఈ సినిమాను డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. దీనిలో భాగంగా న‌టీన‌టుల ఎంపిక పూర్తికావొచ్చింది. ఈ సినిమాల్లో టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ న‌టీన‌టుల‌ను ఎంపిక చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

అసలు బోయపాటి సినిమా అంటేనే అదిరిపోయే ఫైట్స్ ఉంటాయని అందరికి తెలుసు. అయన సినిమాలో హీరో కి ఎంత క్రేజ్ ఉంటుందో అదే స్థాయిలో విలన్ కి కూడా ఇంపార్టెంట్ ఉండేలా బోయపాటి ప్లాన్ చేసుకుంటాడు. దీనిలో భాగంగానే … పవర్ ఫుల్ విలన్ పాత్రధారుల కోసం వెతుకులాట ప్రారంభించాడు బోయపాటి. అందుకే వెతికి వెతికి మరీ ఈ సినిమా కోసం ఒబెరాయ్ ను ఎంపిక చేసాడు బోయపాటి.

‘రక్తచరిత్ర’ సినిమాతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో అభిమానుల‌ను సంపాదించుకున్న వివేక్ ఒబేరాయ్ ఈ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నాడు. ‘ఖైదీ నంబర్ 150’లో వివేక్ ఎంపికచేద్దాం అనుకున్నారు కానీ అది కుదరలేదు. అన్నట్టు ఈ సినిమాలో రమ్యకృష్ణకి కూడా ఓ ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కినట్టు తెలుస్తోంది.
ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్ సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news