Gossipsబయ్యర్లు దొరక్క కష్టాల్లో కూరుకున్న కమల్..!

బయ్యర్లు దొరక్క కష్టాల్లో కూరుకున్న కమల్..!

ఒకప్పుడు తెలుగు స్ట్రైట్ సినిమాలకు పోటీగా తమిళ డబ్బింగ్ సినిమాల మార్కెట్ నడిచింది. అక్కడ స్టార్స్ అయిన రజిని, కమల్, సూర్య, కార్తిల సినిమాలు ఇక్కడ సూపర్ హిట్ సాధించాయి. కోట్లకు కోట్లిచ్చి మరి అక్కడ సినిమాలను కొనేవారు.. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది కోలీవుడ్ సినిమాలు తెలుగులో అంత ప్రభావితం చూపించడం లేదు.

అందుకే రాబోతున్న కమల్ విశ్వరూపం సీక్వల్ సినిమాను ఎవరు కొనట్లేదని తెలుస్తుంది. అందుకే సినిమాను డైరెక్ట్ గా రిలీజ్ చేయబోతున్నారట. ఆగష్టు 10న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కమల్ సొంతంగా రిలీజ్ చేయబోతున్నారట. ఇక్కడ రిలీజ్ వ్యవహారాలను ఎన్వి ప్రసాద్ చూసుకుంటున్నాడట . ఇదే కాదు సూపర్ స్టార్ రజినికాంత్, శంకర్ కాంబినేషన్ లో రాబోయే 2.ఓ సినిమా కూడా బిజినెస్ కష్టాలు తప్పేలా లేవు.

ఈమధ్య రజిని సినిమా ఆశించిన ఫలితాలు అందుకోవట్లేదు అందుకే 2.ఓ కూడా ముందు 80 కోట్ల ఆఫర్ చేసినా ఇప్పుడు వెనక్కి తగ్గారని తెలుస్తుంది. మరి చూస్తుంటే తమిళ డబ్బింగ్ సినిమాలకు తెలుగులో గడ్డుకాలం నడుస్తుందని చెప్పొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news