కాబోయే భార్య గురించి విశాల్ షాకింగ్ కామెంట్స్

Vishal shocking comments on anisha

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అదేంటి విశాల్ కొత్తగా ఇల్లైమైనా కొన్నాడా అంటే ఇంటివాడు అంటే ఇల్లు కొనడమే కాదు తన జీవిత భాగస్వామిని వెతుకున్నాడన్నమాట. అనీషా రెడ్డితో విశాల్ పెళ్లి ఫిక్స్ అయ్యింది. ఎంగేజ్మెంట్ కూడా అయ్యిందని తెలుస్తుంది. అయితే కాబోయే భార్య తన ప్రేయసి అనీషా గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు విశాల్. అనీషా జాతీయ స్థాయిలో బాస్కెట్ బా ప్లేయర్ అట. అంతేకాదు సోషల్ వర్కర్ అని.. పులిని నిద్రపుచ్చే టాలెంట్ ఉందని ఆ వీడియో చూసి తాను షాక్ అయినట్టు చెప్పాడు విశాల్.

కొన్నాళ్లు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మితో ప్రేమాయణం నడిపించిన విశాల్ తన డైరక్షన్ లో వచ్చిన వీధి శునకాలు అనే సినిమా స్క్రిప్ట్ టైంలో అనీషాతో పరిచయం ఏర్పడిందని. ఆ సినిమాకు ఆమె కూడా పనిచేసిందని అన్నాడు విశాల్. అనీషాని దేవుడు తన కోసమే పంపించాడని అన్నాడు విశాల్. మరి కాబోయే భార్య మీద ప్రేమ వలకబోస్తున్న విశాల్ చూస్తుంటే ఇద్దరి మధ్య మంచి అండర్ స్టాడింగ్ ఉండేలా కనిపిస్తుంది. సో కోలీవుడ్ లో కాబోయే మరో బెస్ట్ కపుల్ గా విశాల్ అండ్ అనీషా ఎలా సందడి చేస్తారో చూడాలి.

Leave a comment