తెలుగు హీరోయిన్ తో విశాల్ ప్రేమ వివాహం..!

vishal-marriage-details

హీరో విశాల్ ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయారు, విశాల్ రీసెంట్ గా తమిళ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి ప్రెసిడెంట్ గా నియమితులైన విషయం తెలిసిందే. అందులో భాగంగా విశాల్ చేస్తున్న కొన్ని సంస్కరణలు అందరిని ఆకట్టుకున్నాయి. ఇక విశాల్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే తాజాగా తమిళ మీడియా లో ఒక వార్త చెక్కర్లు కొడుతుంది, అదే విశాల్ పెళ్లి వార్త. ఇప్పటికే 40 సంవత్సరాలు నిండిన విశాల్ ఇక ఈ విషయంలో ఎ మాత్రం ఆలస్యం చేయకుండా త్వరగా పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం.
అయితే గతంలో నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి తో ప్రేమాయణం సాగించాడు విశాల్, కానీ శరత్ కుమార్ తో విభేదాల కారణంగా వీళ్లిద్దరూ విడిపోయారు. అప్పటి నుండి ఈ హీరో ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా.. ఎవర్ని పెళ్లి చేసుకుంటాడా అని కోలీవుడ్ జనాలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.ఇప్పుడు విశాల్ అంతగా గుర్తింపు లేని ఒక తెలుగు హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుస్తుంది. ఇందులో పెద్దగా ఆశర్యపోవటానికి ఏం లేదు. ఎందుకంటే చెన్నైలో పుట్టిపెరిగినప్పటికీ, విశాల్ కుటుంబ సభ్యులు తెలుగువాళ్లే.
ఇక తాజాగా విడుదలైన విశాల్ “అభిమన్యుడు” మంచి ఘన విజయం సాధించింది, అందులో భాగంగా తెలుగు రాష్ట్రాలలో విశాల్ సినిమా ప్రొమోషన్స్ లో బిజీ గా ఉన్నారు. అభిమన్యుడు సక్సెస్ మీట్ అని చెప్పి విశాల్ తెలుగు రాష్ట్రాలలో తిరగటం చూస్తుంటే తన పెళ్లి వార్తలో నిజం ఉందని స్పష్టంగా తెలుస్తుంది.

Leave a comment