పది కోట్లు ఇచ్చిన విశాల్ – కార్తి

vishal karthi

ఒక నటుడు రూ.5 కోట్ల విరాళం ఇవ్వడం అరుదైన విషయం. అది కూడా నటీనటుల సంఘం కోసం నిర్మించబోయే భవనాన్ని ఇంత భారీ మొత్తంలో విరాళం ప్రకటించడం ఆశ్చర్యం కలిగించే విషయమే. తమిళ హీరోలు విశాల్.. కార్తి ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరూ కలిసి నడిగర్ సంఘం కొత్త భవన నిర్మాణం కోసం ఏకంగా రూ.10 కోట్ల విరాళం ప్రకటించారు. చెన్నైలో శుక్రవారం నడిగర్ సంఘం నూతన భవన నిర్మాణానికి భూమి పూజ జరిగిన సందర్భంగా వాళ్లీ మేరకు ప్రకటన చేశారు. రెండేళ్ల కిందటి ఎన్నికల్లో విశాల్.. కార్తి.. నాజర్ టీం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

విశాల్ టీం ప్రధాన ఎన్నికల హామీ.. నడిగర్ సంఘానికి భవనం కట్టడం. ఇందుకోసం ఏడాది కిందటే చెన్నైలో భారీ ఎత్తున క్రికెట్ మ్యాచ్ నిర్వహించి.. రూ.9 కోట్ల దాకా నిధులు సమకూర్చుకున్నారు. మరికొన్ని విరాళాలు కూడా కలిపినా విశాల్ అండ్ టీం అనుకున్న స్థాయిలో భవనం నిర్మించడం కష్టమని తేలింది. మొత్తం నిర్మాణ వ్యయం రూ.26 కోట్లుగా తేలింది.

Leave a comment