Moviesవిశాల్ 'అభిమన్యుడు' తొలిరోజు వసూళ్లు..!

విశాల్ ‘అభిమన్యుడు’ తొలిరోజు వసూళ్లు..!

విశాల్ హీరోగా మిత్రన్ డైరక్షన్ లో వచ్చిన సినిమా అభిమన్యుడు. తమిళంలో సూపర్ హిట్ అయిన ఇరుంబు తిరై సినిమా డబ్బింగ్ వర్షన్ గా రిలీజ్ అయిన ఈ సినిమా రావడం హిట్ టాక్ తెచ్చుకున్నా కలక్షన్స్ చూస్తే మాత్రం అంతగా ఏం బాగాలేవని చెప్పొచ్చు. సినిమా మొదటి రోజు కేవలం 89.88 లక్షలను వసూళు చేసిందని తెలుస్తుంది.

సైబర్ క్రైం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా చూసిన ఆడియెన్స్ అంతా సూపర్ అంటున్నారు. అయితే నిన్న రిలీజ్ అయిన మూడు సినిమాలు ఆఫీసర్, రాజుగాడు, అభిమన్యుడు లలో అభిమన్యుడు బెస్ట్ అని టాక్ వచ్చింది. మొదటిరోజు ఇలా ఉన్నా వీకెండ్ లో మాత్రం తప్పకుండా మంచి వసూళ్లు రాబడుతుందని అంటున్నారు.

అభిమన్యుడు మొదటిరోజు వసూళ్లు ఏరియాల వారిగా :

నైజాం : 22 లక్షలు

సీడెడ్ : 11 లక్షలు

ఉత్తరాంధ్ర : 13 లక్షలు

గుంటూర్ : 15 లక్షలు

కృష్ణా : 10 లక్షలు

ఈస్ట్ : 7 లక్షలు

వెస్ట్ : 4.50 లక్షలు

నెల్లూరు : 7.38 లక్షలు

ఏపి/ టిఎస్ కలక్షన్స్ : 89.88 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news