భారత ప్రధానినే ఛాలెంజ్ చేసిన కోహ్లీ … సిద్ధం అన్న మోడీ !!

virat-kohli-versus-narendra

హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్ అంటూ ఫిట్ నెస్ ఛాలెంజ్ విసిరాడు కేంద్ర క్రీడా శాఖా మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్. పుషప్స్ చేస్తూ ఇండియన్ క్రికెటర్ విరాట్ కొహ్లి, హృతిక్ రోషన్, సైనా నెహ్వాల్ కు ఈ ఛాలెంజ్ విసిరాడు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్. ఇక ఆయన ఛాలెంజ్ ను స్వీకరించిన విరాట్ కొహ్లి తాను కూడా ఫిట్ గా ఉన్నానంటూ ఈ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా తన భార్య అనుష్క శర్మ, ఎమ్మెస్ ధోనిలతో పాటుగా భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఛాలెంజ్ విసిరాడు.

కొహ్లి ఛాలెంజ్ ను అంగీకరిస్తూ తాను త్వరలో తన ఓన్ ఫిట్ నెస్ వీడియో పెడతానని రిప్లై ట్వీట్ చేశారు నరేంద్ర మోడి. ఐస్ బకెట్ ఛాలెంజ్ నుండి ట్విట్టర్ లో ఈ టైప్ ఆఫ్ ఛాలెంజ్ జరుగుతూనే ఉన్నాయి. ఇక తెలుగులో ఈ ఛాలెంజ్ అందుకున్నాడు అక్కినేని అఖిల్. తాను కూడా ఫిట్ గా ఉన్నానంటూ ఈ ఛాలెంజ్ ను తన అన్న నాగ చైతన్య, డాడీ నాగార్జునలతో పాటుగా మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ తో పాటుగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కు ఛాలెంజ్ చేశాడు.

మన ఫిట్ గా ఉంటే దేశం కూడా ఫిట్ గా ఉంటుంది అన్న పంథాలో కొనసాగుతున్న ఈ ఛాలెంజ్ ను సెలబ్రిటీస్ పాటించడం సామాన్య ప్రజల్లో కూడా చైతన్యాన్ని కలిగించడం కోసమే అని తెలుస్తుంది.

Leave a comment