రంగస్థలంలో ఇంత రాజకీయమా ..? అయ్యో చెర్రి !

Release-Still

‘రంగస్థలం 1985’ ఈ సినిమా మీద మెగా అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. పూర్తిగా గ్రామీణ వాతావరణం లో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించిన ఏ విషయం బయటకి పొక్కినా అది పెద్ద చర్చే జరుగుతోంది . అయితే తాజాగా ఈ సినిమా కి సంబంధించి ఒక వార్త చక్కెర్లు కొడుతోంది. అదేంటంటే ఈ సినిమా మొత్తం గ్రామీణ రాజకీయాల నేపథ్యంలో ఉండబోతుందంట.

సాధారణంగా సుకుమార్ తన సినిమాల కోసం కొత్త జోనర్లను ఎంపిక చేసుకుంటూ ఉంటారు. ఆర్య, 100% లవ్, వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో.. ఇలా సుకుమార్ దర్శకత్వం వహించిన ఏ చిత్రాన్ని తీసుకున్నా రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉంటాయి. అయితే చరణ్‌తో తీసే సినిమా నాటకాల నేపథ్యంలో సాగుతుందనే మాటలు వినిపించాయి. చెవిటివాడి పాత్రలో చెర్రీ  కనిపిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది.

రంగస్థలం గ్రామంలో రాజకీయ ఆధిపత్యం కోసం ఎత్తుగడలు వేస్తూ.. కుర్చీ కోసం ఒకరితో ఒకరు పోటీ పడే అంశాలను చూపించబోతున్నారట. పక్కా పల్లెటూరి రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం. అయితే కథలో భావోద్వేగాలు శిఖర స్థాయిలో ఉంటాయని తెలుస్తోంది.

ప్రేమ, భావోద్వేగాలు, రాజకీయాలు వీటి కలయికే ఈ ‘రంగస్థలం’. సమంత హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా మీద చెర్రీ కూడా భారీగానే ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా కోసం తొలిసారిగా రాంచరణ్ గుబురు గెడ్డం పెంచుకుని మీసాలు మెలేసాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కతోంది.

Leave a comment