Movies" విజేత " ట్రైలర్ అదరహో అనిపించింది..!

” విజేత ” ట్రైలర్ అదరహో అనిపించింది..!

మెగాస్టార్ చిరంజీవి చిన్నళ్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా రాకేష్ శషి డైరక్షన్ లో వస్తున్న సినిమా విజేత. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను వారాహి చలన చిత్ర బ్యానర్లో సాయి కొర్రపాటి నిర్మించారు. ఆదివారం సాయంత్రం ఆడియో రిలీజ్ జరుపుకోగా మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. దర్శకుడు రాజమౌళి కూడా ఈ ఆడియో వేడుకలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. తండ్రికొడుకుల సెంటిమెంట్ తో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంది. కళ్యాణ్ దేవ్ బాగానే ఉన్నాడు. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ కూడా సినిమాకు హెల్ప్ అవనుంది. మురళి శర్మ హీరో తండ్రి పాత్రలో నటిస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుండి మరో హీరోగా వస్తున్న కళ్యాణ్ దేవ్ మెగా అభిమానుల అహ్బిమానం గెలుచుకుంటాడో లేదో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news