ట్యాక్సీ వాలాగా మారిన అర్జున్ రెడ్డి..!

Arjun-Reddy
విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. సందీప్ వంగ డైరక్షన్ లో వచ్చిన అర్జున్ రెడ్డి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా సూపర్ హిట్ అయ్యింది. ఇక ఆ సినిమా తర్వాత గీతా ఆర్ట్స్-2 బ్యానర్లో సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ యువి క్రియేషన్స్ లో కూడా ఓ సినిమా కమిట్ అయ్యాడు.
ఆ సినిమాను ది ఎండ్ అనే హర్రర్ మూవీ చేసిన రాహుల్ సాంకృత్యన్ డైరక్షన్ లో రాబోతుంది. ఇక ఈ సినిమాకు టైటిల్ గా ట్యాక్సీవాలా అని పెట్టబోతున్నారట. టైటిల్ ను బట్టి చూస్తే సినిమాలో విజయ్ ట్యాక్సీ డ్రైవర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. నాచురల్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిన ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ రేంజ్ ఏంటో అందరికి తెలిసిందే. ఒక్క సినిమాతో స్టార్ ఇమేజ్ దక్కించుకున్న విజయ్ సినిమాల సెలక్షన్ లో ఆచితూచి అడుగులేస్తున్నాడు. మరి ట్యాక్సీవాలాగా విజయ్ ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి.

Leave a comment