Gossipsమణిరత్నం కి బిగ్ షాక్ ఇచ్చిన విజయ్ దేవరకొండ..

మణిరత్నం కి బిగ్ షాక్ ఇచ్చిన విజయ్ దేవరకొండ..

అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిన విజయ దేవరకొండ ఇంకా ఆ సినిమా క్యారెక్టర్ లోనే ఉండిపోయినట్టు ఉన్నాడు. అతని ప్రవర్తన చూస్తుంటే.. ఇంకా ఆ  హ్యాంగోవర్ నుంచి బయటపడలేదేమో అనిపిస్తోంది అంటూ సెటైర్లు విసురుతున్నారు సినీ జనాలు. ఈ సినిమా సక్సస్ ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో విజయ్ ఇప్పటికే మితిమీరిన ఉత్సాహంతో ఉన్నదంటూ  ఘాటైన విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ‘అర్జున్ రెడ్డి’ సినిమా రిలీజై చాలా రోజులు అయినా  విజయ్ దేవరకొండ బయట కూడ ‘అర్జున్ రెడ్డి’ లా ఫీల్ అవుతూ అదే యాటిట్యూడ్ ప్రవర్తిస్తున్నాడేమో అనిపిస్తోంది.

వరుసపెట్టి సినిమా అవకాశాలు వస్తుండడంతో విజయ్ తీరికలేకుండా సినిమాలు ఒప్పేసుకున్నాడు. దీంతో ఓ ఫేమస్ తమిళ్ డైరక్టర్ తీయబోయే సినిమా నుంచి అర్దాంతరంగా తప్పుకున్నాడు. కాల్షీట్స్ సర్దుబాటు చెయ్యలేక మణిరత్నం సినిమానే పక్కన పెట్టే స్థాయికి వెళ్ళిపోయాడని సినీ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.

విజయ్ దేవరకొండ హీరోగా మణిరత్నం ఒక సినిమా ప్లాన్ చేశాడట. తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కించాలని మణిరత్నం ఆలోచన. ఆ సినిమా  తెలుగు వెర్షన్ కోసం విజయ్ దేవరకొండని హీరోగా అనుకున్నాడట. స్టోరీ నెరేషన్, డేట్లు ఫిక్స్ చేసుకోవడం మొదలైనవి అన్నీ పూర్తయ్యాయి. కానీ అనుకోకుండా  విజయ్ ఈ సినిమా  నుంచి తప్పుకున్నాడట. దాంతో విజయ్ స్థానంలో మరొకరిని తీసుకొనే ప్రయత్నంలో ఉన్నాడట మణిరత్నం.

‘అర్జున్ రెడ్డి’తో తన ఇమేజ్ ఎన్నోరెట్లు పెరిగింది కాబట్టి ఒప్పుకున్న సినిమాలకు డేట్స్ సర్దుబాటు చేయలేక విజయ్ మణిరత్నం సినిమా అయినా సరే పక్కన పెట్టాడట. మణిరత్నం లాంటి పెద్ద దర్శకుడి సినిమానే వదలుకున్న విజయ్ దేవరకొండ తన నిర్ణయంతో అందరికీ షాకిస్తున్నాడు. ఎలాంటి అవకాశాలు రానప్పుడు దర్శకుడు చిన్నవాడా, పెద్ద వాడా అని చూసే అవకాశం ఉండదు. అదే వరుస ఆఫర్స్ ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంటే ఎంతటి పెద్ద దర్శకుడి సినిమాకయినా డేట్లు సర్దుబాటు చేసే అవకాశముండదు. ఇప్పుడు ఈ అర్జున్ రెడ్డి కూడా అదే నిరూపిస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news